Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI News: క్వారంటైన్ నిబంధనపై ప్రవాస భారతీయుల అభ్యంతరం.. ఇలా అయితే ఎలా అని ప్రశ్నిస్తున్న ఎన్ఆర్ఐలు!

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ (Omicron)వేరియంట్ మరింత అంటువ్యాధులకు దారితీసిన నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఏడు రోజుల నిర్బంధ నిబంధనలపై ప్రవాసీ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

NRI News: క్వారంటైన్ నిబంధనపై ప్రవాస భారతీయుల అభ్యంతరం.. ఇలా అయితే ఎలా అని ప్రశ్నిస్తున్న ఎన్ఆర్ఐలు!
Nris Objection On Quarantine
Follow us
KVD Varma

|

Updated on: Jan 12, 2022 | 7:36 PM

వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ (Omicron)వేరియంట్ మరింత అంటువ్యాధులకు దారితీసిన నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఏడు రోజుల నిర్బంధ నిబంధనలపై ప్రవాసీ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కె.వి. షార్జాకు చెందిన ప్రవాసీ బంధు వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ శంసుధీన్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖలో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ వారు నివసిస్తున్న దేశం నుంచి వ్యాక్సిన్ వేయించారని, దీనికి సరైన సర్టిఫికేట్ కూడా ఉందని ఆయన లేఖలో చెప్పారు. నిర్ణీత వ్యవధిలోపు ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ ఉంటే మాత్రమే విమానం ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. ఈ అన్ని నివారణ చర్యలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ప్రయాణీకులను వచ్చిన తర్వాత ఒక వారం పాటు నిర్బంధంలోకి వెళ్లమని కోరడం సమంజసం కాదని ఆయన చెప్పారు.

“ఈ ఆర్డర్ విదేశాలలో పని చేస్తున్న ప్రవాస భారతీయులకు (NRI) చాలా అసౌకర్యాన్ని సృష్టిస్తోంది” అని శంసుధీన్ అన్నారు. చాలామంది విదేశాల నుంచి చిన్న సెలవు కోసం వస్తున్నారు. అందులో వారు ఏడు రోజులు క్వారంటైన్ లో ఉండవలసి వస్తుంది. అని ఆయన అన్నారు. ఇక కేరళలో ప్రస్తుత పరిస్థితిపై ఆయన విమర్శలు చేశారు. కేరళలో భారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఫేస్ మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. సురక్షితంగా సామాజిక దూరం పాటించరు” అని ఆయన ఆరోపించారు. ఏడు రోజుల క్వారంటైన్‌పై ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని షంసుద్దీన్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు ఇలాంటి ఆంక్షలు లేకపోవడంపై కూడా ప్రవాస భారతీయులు( NRIలు) కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కేరళ విభాగం ప్రభుత్వ చర్యను “అశాస్త్రీయమైనది” అని పేర్కొంది, ఇది NRIలను మరింత ఒత్తిడికి గురి చేస్తుందని చెప్పింది. అదేవిధంగా మలయాళీలకు చెందిన మరో ప్రవాసీ సంస్థ ప్రవాసీ వెల్ఫేర్ ఫోరమ్, మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి తమ సొంత రాష్ట్రానికి తిరిగి రావాలని యోచిస్తున్న చాలా మంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వ నిర్ణయం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో RT-PCR పరీక్షలు జరుగుతున్నాయి .. వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన వారిని నిర్బందిస్తున్నారు. నియంత్రణ చర్యగా ఇది సరిపోతుందని ఫోరం అధ్యక్షుడు రజాక్ పాలేరి .. కార్యదర్శి హసనుల్ బన్నా అన్నారు. మహమ్మారి మొదటి దశలో కనిపించిన విధంగా ఎన్నారైలు మరొక రౌండ్ సంక్షోభాన్ని చూస్తున్నారని వారు గ్రహించారు అని ఆయన చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Ashok Elluswamy: మస్క్​’టీమ్’లో భారత సంతతి ఇంజినీర్.. వెల్లడించిన ​ఎలాన్ మస్క్..

RBI Rules: వినియోగదారులు అలర్ట్‌.. బాదుడే.. బాదుడు.. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు..!