Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: వికసిత్ భారత్ 2047 విజన్‌ కల సాకారానికి ముందడుగు పడిందిః కిషన్ రెడ్డి

“కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రగతిశీల మరియు దూరదృష్టితో కూడిన ప్రకటనల కోసం గౌరవనీయులైన ఆర్థిక మంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మైనింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఆరు డొమైన్‌లలో పరివర్తనాత్మక సంస్కరణలను ప్రారంభించడం ఈ బడ్జెట్ లక్ష్యం అని గౌరవనీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.

Kishan Reddy: వికసిత్ భారత్ 2047 విజన్‌ కల సాకారానికి ముందడుగు పడిందిః కిషన్ రెడ్డి
Kishan Reddy Minister
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 01, 2025 | 9:09 PM

“కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రగతిశీల మరియు దూరదృష్టితో కూడిన ప్రకటనల కోసం గౌరవనీయులైన ఆర్థిక మంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మైనింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఆరు డొమైన్‌లలో పరివర్తనాత్మక సంస్కరణలను ప్రారంభించడం ఈ బడ్జెట్ లక్ష్యం అని గౌరవనీయ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.

రాబోయే ఐదేళ్లలో మన ప్రపంచ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తూ ఇంధన పరివర్తన, స్థిరమైన అభివృద్ధి వైపు భారత్ అడుగులు వేస్తుందనడానికి ఈ బడ్జెట్ సూచిస్తుందన్నారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు, ముఖ్యంగా కీలకమైన ఖనిజాలకు సంబంధించి, ఆత్మనిర్భర్, భవిష్యత్తు-సన్నద్ధమైన భారత్‌ను నిర్మించడంలో ఈ బడ్జెట్ దోహదపడుతోంది. విక్షిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో ఒక ప్రధాన అడుగు పడిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

బొగ్గు గనుల రంగంలో సంస్కరణల శ్రేణి స్వదేశంలో ఉత్పత్తి, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో ప్రపంచ ఖనిజాల మార్కెట్‌లో భారతదేశాన్ని కీలక ప్లేయర్‌గా మారనుంది. సంస్కరణలు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రారంభానికి అనుకూలమైన సమయంలో వస్తాయి. ఇందుకు కేంద్ర బడ్జెట్ భారీ ప్రోత్సాహాన్ని ఇస్తాయన్నారు. ఇంధన భద్రత, ఇంధన పరివర్తన లక్ష్యాల మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి కేంద్రం దృష్టి సారించినట్లు కేమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ కోసం రూ. 300 కోట్ల కేటాయింపులు తక్కువ ఉద్గారాలకు, కార్బన్ క్యాప్చర్, హైడ్రోజన్ ఉత్పత్తికి మార్గాలను అందిస్తాయన్నారు. భారతదేశ ఇంధన పరివర్తన లక్ష్యాలకు భారీ ఊపునిస్తుంది. దేశానికి ఇంధన భద్రతకు భరోసానిస్తూ స్వచ్ఛమైన బొగ్గును ఉత్పత్తి చేసే మన సామర్థ్యాలను పెంచుతుందన్నారు కిషన్ రెడ్డి.

కాంపిటేటివ్ ఫెడరలిజం స్ఫూర్తికి అనుగుణంగా, స్టేట్ మైనింగ్ ఇండెక్స్ పరిచయం అనేది రాష్ట్ర మైనింగ్ డిపార్ట్‌మెంట్ల ప్రొఫెషనలైజేషన్‌ను మెరుగుపరిచి, ఖనిజాల అన్వేషణ, స్థిరమైన మైనింగ్‌లో ఉత్తమ పద్ధతులను ఆవిష్కరించడానికి సహాయపడుతుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు మన ఖనిజ వనరుల యొక్క అపారమైన సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి.

అలాగే కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ నేతల విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించడం మంచిది కాదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచిన 90శాతానికి పైగా పథకాలు తెలంగాణకు కూడా వస్తాయన్నారు. విభజన చట్టంలోని హామీల ప్రకారమే ఏపీకి కేటాయింపులు చేశామన్న కిషన్ రెడ్డి, హామీ మేరకే అమరావతి, పోలవరం, రైల్వేజోన్‌కు నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు వచ్చిందన్నారు. అలాగే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. అవసరాన్ని బట్టి తెలంగాణకు అన్ని రకాల పథకాలు అందించేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..