AP Bhavan: ఏపీ భవన్ విభజనపై కుదరని ఏకాభిప్రాయం.. ఇష్యూ తేల్చేపనిలో ఢిల్లీ పెద్దలు.. చివరికి ఏమైందంటే..
మళ్లీ సేమ్ సీన్. ఇష్యూ ఎటూ తేల్లేదు. ఢిల్లీలోని AP భవన్ విభనపై ఏకాభిప్రాయం కుదర్లేదు.! ఎవరి వాదనలు వాళ్లే వినిపించారు. మరో వారం తర్వాత మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు..

ఏపీ, తెలంగాణ మభ్య విభజన సమస్యలు చాలానే ఉన్నాయి. అందులో ఏపీ భవన్ కూడా ఒకటి. దాదాపు 9 ఏళ్లుగా ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఈ ఇష్యూ తేల్చేందుకే ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది కేంద్రం. ఏపీ భవన్ విభజనపై తమ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖకు అందజేశారు ఏపీ, తెలంగాణ అధికారులు. మరో వారం రోజుల్లో ఇరు రాష్ట్రాల అధికారులు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. విభజనపై ఇప్పటికే రెండు ప్రతిపాదనలు పంపింది ఏపీ. అయితే ఈ ప్రతిపాదనలను తెలంగాణ తోసిపుచ్చుతోంది. నిజాం వారసత్వ ఆస్తి కాబట్టి మొత్తం తమకే దక్కాలని డిమాండ్ చేస్తోంది. విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 58:42 నిష్పత్తిలో పంచాలంంటోది కేంద్రం.
విభజన చట్టం సెక్షన్ 66 ఇదే చెబుతోందని గుర్తుచేస్తోంది. మొత్తం 19.7 ఎకరాల స్థలంలో ఏపీ భవన్ ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 8.4 ఎకరాలు, ఏపీకి 11.3 ఎకరాలు దక్కే అవకాశం ఉంది.
మిగతా విభజన సమస్యల మాదిరిగానే ఏపీ భవన్ విషయం కూడా ఏటూ తేలడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగాయి. అయినా సమస్య కొలిక్కి రాలేదు. ఏకాభిప్రాయం రానిపక్షంలో కేంద్రంమే ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది..! జనాభా నిష్పత్తి ప్రకారమే విభజించేందుకు కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం




