Karnataka Elections: ఎన్నికల ప్రచారంలో కలర్‌ఫుల్‌ సీన్స్‌.. ర్యాలీలో యోగీ.. టిఫిన్ సెంటర్‌లో దోశ వేసిన ప్రియాంక

కర్నాటక ఎన్నికల ప్రచారం రసవత్తంగా మారింది. ప్రధాన పార్టీల తరపున స్టార్‌ క్యాంపేనర్లు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున ప్రియాంకాగాంధీ , బీజేపీ తరపున యోగి , శివరాజ్‌సింగ్‌ ప్రచారం చేశారు

Karnataka Elections: ఎన్నికల ప్రచారంలో కలర్‌ఫుల్‌ సీన్స్‌.. ర్యాలీలో యోగీ.. టిఫిన్ సెంటర్‌లో దోశ వేసిన ప్రియాంక
BJP Karnataka
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 26, 2023 | 8:56 PM

కర్నాటక ఎన్నికల ప్రచారం రసవత్తంగా మారింది. ప్రధాన పార్టీల తరపున స్టార్‌ క్యాంపేనర్లు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున ప్రియాంకాగాంధీ , బీజేపీ తరపున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , సీఎం శివరాజ్‌సింగ్‌ ప్రచారం చేశారు. కర్నాటక ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్‌ జాతీయ నాయకులను రంగం లోకి దింపాయి. బీజేపీ తరపున ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. మాండ్యలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ రోడ్‌షో నిర్వహించారు. బెల్గాంలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రచారం చేశారు. బీజేపీ పాలనలో యూపీలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని , కర్నాటకలో కూడా మరోసారి బీజేపీని గెలిపించాలన్నారు యోగి. రాహుల్‌గాంధీకి 50 ఏళ్లు వచ్చినప్పటికి ఐదేళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాకని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు.

కర్నాటక ఎన్నికల ప్రచారంలో కలర్‌ఫుల్‌ సీన్స్‌ కన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్ధుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు ప్రియాంకాగాంధీ. మైసూర్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. ఓ రెస్టారెంట్‌లో దోశ వేశారు ప్రియాంక. హోటల్‌ యాజమానితో , సిబ్బందితో మాట్లాడారు ప్రియాంక. జీఎస్టీతో వ్యాపారులు చాలా బాధలు పడుతున్నారని అన్నారు ప్రియాంక.

చిత్రదుర్గ ర్యాలీలో ప్రియాంక ఓటర్లపై ప్రశ్నలవర్షం కురిపిస్తోంది. 40 శాతం కమీషన్ల ప్రభుత్వం ఎవరిదనీ, కుంభకోణాలు ఎవరివనీ, కాంట్రాక్టర్లను వేధించింది ఎవరనీ ఆమె ప్రశ్నించారు. మీ భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. చిత్రదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు . ఆలయం సమీపంలో గజరాజు ఆశీర్వాదం తీసుకున్నారు ప్రియాంక.

కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ సీఎం జగదీష్‌ షెట్టార్‌ ఎన్నికల్లో గెలచే ఛాన్స్‌ లేదంటున్నారు బీజేపీ నేత యడియూరప్ప. అంతేగాదు, తాను ఈ విషయాన్ని రక్తంతో రాసిస్తానని యడియూరప్ప హుబ్లీలో కార్యకర్తలతో చెప్పారు. జగదీష్‌ షెట్టార్‌ హుబ్లి-ధార్వాడ్‌ సెంట్రల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీచేస్తున్నారు. అయితే యడియూరప్ప తిట్లను తాను ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు జగదీష్‌షెట్టార్‌ చెప్పారు. ఆయన కోరిక తన విజయంగా మారుతుందని షెట్టార్‌ వివరించారు.

వాళ్లిద్దరు రాజకీయ ప్రత్యర్ధులు .. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇద్దరు బిజీగా ఉన్నారు. ఒకరు కర్నాటక సీఎం బస్వరాజ్‌ బొమ్మై.. మరొకరు విపక్ష నేత సిద్దరామయ్య. బెల్గాం ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఎదురుపడ్డారు. రాజకీయ విభేదాలు మర్చిపోయి అప్యాయంగా పలుకరించుకున్నారు. బొమ్మై భుజం తట్టి గుడ్‌లక్‌ చెప్పారు సిద్దరామయ్య. బొమ్మై కూడా అంతే అప్యాయంగా సిద్దరామయ్య భుజం మీద చేసి వెంట నడిచారు. ఈ దృశ్యం ఎయిర్‌పోర్ట్‌లో అందరిని ఆకట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం