స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారికి ప్రత్యేక ఆహ్వానం

ఆగస్టు 15 వేడుకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి కోలుకున్న వారిని స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారికి ప్రత్యేక ఆహ్వానం
Follow us

|

Updated on: Jul 23, 2020 | 4:27 PM

చరిత్రలో తొలిసారి భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సాదాసీదాగా జరగబోతున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అమలు చేస్తున్న నిబంధనల కారణంగా నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఆగస్టు 15 వేడుకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి కోలుకున్న వారిని స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని పేర్కొన్న కేంద్రం.. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్‌ ధరించాలని తెలిపింది. అటు, కరోనా అత్యవసర సమయంలో సేవలందించిన వారిని వేడుకలకు అతిథులుగా ఆహ్వానించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నందున భారీ సంఖ్యలో జనం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.