రాఫెల్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు రంగంలోకి హమ్మర్ మిస్సెల్స్‌..!

ఓ వైపు పాక్‌ కవ్వింపులు.. మరోవైపు డ్రాగన్ కంట్రీ కన్నింగ్ వేశాలు.. ఇవి గత రెండు నెలలుగా భారత సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు. ముఖ్యంగా గత నెలలో లదాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనాకు, భారత్‌ జవాన్లకు..

రాఫెల్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు రంగంలోకి హమ్మర్ మిస్సెల్స్‌..!
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 3:59 PM

ఓ వైపు పాక్‌ కవ్వింపులు.. మరోవైపు డ్రాగన్ కంట్రీ కన్నింగ్ వేశాలు.. ఇవి గత రెండు నెలలుగా భారత సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు. ముఖ్యంగా గత నెలలో లదాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనాకు, భారత్‌ జవాన్లకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందగా.. దాదాపు నలభై మందికి పైగా చైనా సైనికులు మరణించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనండంతో.. ఇరు దేశాలు సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరించాయి. అయితే భారత్‌ కంటే చైనా కాస్త ఆయుధ సంపత్తిలో పటిష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు వెంటనే ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధించింది. ఇదే క్రమంలో రూ.500 కోట్లతో ఆయుధ సంపత్తిని పెంచుకోవాలంటూ ఆర్మీకి స్వేచ్ఛని ఇచ్చింది. మరోవైపు ఈ జూలై 29వ తేదీన ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. తొలి విడతగా కొన్ని యుద్ధ విమానాలు రానున్నాయి.

అయితే ఈ రాఫెల్ సామర్ధ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు భారత ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే హమ్మర్ మిస్సెల్స్‌కు ఆర్డర్ ఇచ్చింది. వీటి ద్వారా రాఫెల్ యుద్ధ విమానాల సామార్ధ్యం మరింత పెరగనుంది. ఈ హమ్మర్ మిస్సెల్స్‌ 60-70 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేయగలవు. లదాఖ్‌ వంటి మంచు కొండల్లో ఉన్న లక్ష్యాలను కూడా సులువుగా ఈ హమ్మర్ మిస్సెల్స్ చేధించగలవు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ మిస్సెల్స్‌కు భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు