Umpire Killed: ఏంటి ఈ దారణం..అంపైర్ నో బాల్ ఇచ్చాడని కత్తితో పొడిచి చంపిన యువకుడు

రెండు గ్రామాల క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. అంపైర్ నో బాల్ ఇచ్చినందుకు అతడ్ని కొట్టి కత్తితో పొడిచి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే ఒడిషాలోని చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం అండర్ 18 క్రికెట్ మ్యాచ్ జరిగింది.

Umpire Killed: ఏంటి ఈ దారణం..అంపైర్ నో బాల్ ఇచ్చాడని కత్తితో పొడిచి చంపిన యువకుడు
Accused
Follow us
Aravind B

|

Updated on: Apr 03, 2023 | 6:55 PM

రెండు గ్రామాల క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. అంపైర్ నో బాల్ ఇచ్చినందుకు అతడ్ని కొట్టి కత్తితో పొడిచి చంపేశారు. వివరాల్లోకి వెళ్తే ఒడిషాలోని చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం అండర్ 18 క్రికెట్ మ్యాచ్ జరిగింది. అయితే శంకర్‌పూర్‌, బెర్హంపూర్‌ గ్రామాలకు మధ్య మ్యాచ్ జరుగుతుండగా మహిలాంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల లక్కీ రౌత్‌ అంపైర్‌గా వ్యవహరించాడు. ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇది వాగ్వాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అంపైర్ లక్కీ రౌత్, ప్లేయర్ జగ్‌ రౌత్‌ మధ్య ఘర్షణ జరిగింది. జగ్‌ రౌత్‌ తన సోదరుడు మునా రౌత్‌ను గ్రౌండ్ కు పిలిపించాడు. అక్కడకు వచ్చిన అతడు ఆగ్రహంతో లక్కీ రౌత్‌ను కొట్టాడు. ‘నో బాల్‌’ సిగ్నల్‌ ఇచ్చిన ఆ అంపైర్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.

తీవ్ర గాయాలు పాలైన లక్కీ రౌత్ ను ఆస్పత్రికి తరలించగా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగిన అనంతరం నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పంగించారు. అయితే లక్కీ రౌత్ మృతి చెందడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం