మద్యం మత్తులో భర్త..ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..అసలేం జరిగిందంటే

ఉత్తరప్రదేశ్‎లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన బచ్రావన్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలోని తులేహండి గ్రామంలో ఓ దంపతులు జీవిస్తున్నారు.

మద్యం మత్తులో భర్త..ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..అసలేం జరిగిందంటే
Death
Follow us
Aravind B

|

Updated on: Apr 03, 2023 | 6:17 PM

ఉత్తరప్రదేశ్‎లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన బచ్రావన్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలోని తులేహండి గ్రామంలో ఓ దంపతులు జీవిస్తున్నారు. అయితే ఆ భార్యకు తమ గ్రామంలోనే ఉంటున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతను ఆమె భర్తకు కూడా పరిచయమే. అయితే మార్చి 30న భర్త.. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి మద్యం సేవించాడు. అనంతరం నిద్రపోయాడు. ఆ తర్వాత భార్య, ప్రియుడికి మధ్య గొడవ మొదలైంది. అరుపులు వినిపించడంతో భర్తకు మెలుకువ వచ్చింది. అయితే ఆ సమయంలో తన భార్యను ఆమె ప్రియుడితో కలిసి అసభ్యకరమైన స్థితిలో ఉండటం చూసి తట్టుకోలేక పోయాడు.

వారిద్దరిపై కోపంతో ఊగిపోయి వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆమె తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత పోలీసులకు తాము హత్య చేయలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తన ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి