AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan in Delhi: ఢిల్లీలో పవన్ కల్యాణ్.. ఆ ఇద్దరు బీజేపీ నేతల్ని కలిసే అవకాశం

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌.. నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు.

Pawan Kalyan in Delhi: ఢిల్లీలో పవన్ కల్యాణ్.. ఆ ఇద్దరు బీజేపీ నేతల్ని కలిసే అవకాశం
Pawan Kalyan
Aravind B
|

Updated on: Apr 03, 2023 | 6:01 PM

Share

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌.. నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్ తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై భాజపా పెద్దలతో పవన్‌ చర్చించే అవకాశముంది.

అయితే కర్నాటక ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ వెళ్తారంటూ పలు వార్తలు బయటకు వస్తున్నాయి. కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న పవన్..ఉదయ్ పూర్ నుంచి అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక జనసేనతో పొత్తుపై బీజేపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి సరైన సహకారం అందడం లేదని పలువురు బీజేపీ నాయకులు ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పవన్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఇప్పుడు పవన్ కూడా హస్తిన బాట పట్టడంతో రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి
సర్కార్ ఆస్పత్రుల్లో IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్
సర్కార్ ఆస్పత్రుల్లో IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్
బ్రిటీషువారు కట్టించిన ఏకైక శివాలయం.. భారత్‌లో ఎక్కడుంది?
బ్రిటీషువారు కట్టించిన ఏకైక శివాలయం.. భారత్‌లో ఎక్కడుంది?
కోహ్లీకే దమ్కీ ఇచ్చిన తెలుగబ్బాయ్.. అసలెవరీ పీవీఎస్ఎన్ రాజు?
కోహ్లీకే దమ్కీ ఇచ్చిన తెలుగబ్బాయ్.. అసలెవరీ పీవీఎస్ఎన్ రాజు?
అమ్మా..! నీ కంటే ముందే వెళ్తున్నా..
అమ్మా..! నీ కంటే ముందే వెళ్తున్నా..
త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
వైకుంఠ ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!
వైకుంఠ ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!
అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా..
అన్న కోసం 130 కిలోమీటర్లు.. ఈ తమ్ముడు చేసిన పనికి అంతా ఫిదా..
విజయవాడ GGH 'ఆకలి రాజ్యం'లో ఎలుకల స్వైర విహారం.. వీడియో
విజయవాడ GGH 'ఆకలి రాజ్యం'లో ఎలుకల స్వైర విహారం.. వీడియో
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..