Kerala: డ్యాన్స్ ఈవెంట్ లో ప్రమాదం.. ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయం.. వెంటిలేటర్‌పై చికిత్స..

అతిధిగా ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎత్తైన వేదిక నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో తల పగిలి తీవ్ర రక్త స్రావం అయింది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కలూర్ స్టేడియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉమా థామస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. ఆమె గాయం నుంచి తీవ్ర రక్త స్రావం అయినట్లు తెలుస్తోంది.

Kerala: డ్యాన్స్ ఈవెంట్ లో ప్రమాదం.. ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయం.. వెంటిలేటర్‌పై చికిత్స..
Uma Thomas Accident
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2024 | 12:51 PM

కేరళలోని కలూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఈవెంట్‌లో వేదికపై నుంచి పడిపోవడంతో త్రిక్కకర ఎమ్మెల్యే ఉమా థామస్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు.

ఉమా థామస్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది సిటి స్కాన్‌లో తలలో గ్రేడ్ 2 డిఫ్యూజ్ అక్షసంబంధ గాయం (మెదడు గాయం) అయినట్లు తెలిపింది. అంతేకాదు గర్భాశయం, వెన్నెముకలో గాయాలు కూడా అయినట్లు.. పై నుంచి కిందకు పడడం వలన ముఖం, పక్కటెముకలలో పగుళ్లు ఏర్పడ్డాయని వెల్లడించింది. అంతేకాదు ఊపిరితిత్తులలో రక్తస్రావం అవుతుందని చెప్పారు. తలకు తీవ్ర గాయం అయినా సరే ప్రస్తుతం అత్యవసర శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. ప్రాథమిక CT స్కాన్‌లో శరీరంలోని ఎముకలలో తీవ్రమైన పగుళ్లు కనిపించలేదు. గాయాలకు స్టిచెస్ వేసినట్లు చెప్పారు. ఉమా థామస్ కండిషన్ గురించి 24 గంటల పర్యవేక్షణ తర్వాత మాత్రమే స్పష్టంగా చెప్పగమని వెల్లడించింది.

వేదికపై ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు

వేదిక ఏర్పాటులో లోపాలున్నాయని గుర్తించిన పలరివట్టం పోలీసులు.. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులపై, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌పై అగ్నిమాపక దళం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేసింది. జిల్లా అగ్నిమాపక అధికారికి అందిన ప్రాథమిక నివేదికను ఈ రోజు అగ్నిమాపక అధికారికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే హాజరైన వేదిక వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేవని నివేదికలో పేర్కొన్నారు. ఏదైనా ఈవెంట్‌ను నిర్వహించేటప్పుడు.. ప్రాథమిక భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలి. స్టేజీ రెండు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే దాని వైపులా 1.2 మీటర్ల ఎత్తులో బారికేడ్లు ఏర్పాటు చేయాలనేది నిబంధన. కాలూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఏర్పాట్లేవీ చేయలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఒక వరుస కుర్చీలు వేయగలిగే చోట రెండు వరుసల్లో కుర్చీలు వేశారు. ఘటనా స్థలంలో అంబులెన్స్‌లు ఉన్నాయి.. అయితే రెస్క్యూ వర్కర్లు లేదా వైద్యులు అందుబాటులో లేరు. వేదిక 55 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే

సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. స్టేడియంలో ప్రారంభమైన ‘మృదంగ నాదం’ సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే ఉమా థామస్ వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమం 12,000 మంది భరతనాట్య నృత్యకారులు గిన్నిస్ రికార్డుని నెల కొల్పే ప్రయత్నంగా ఏర్పాటు చేశారు. ఈ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీకి సమీపంలోని రెండు వేదికలపై సంగీత ప్రదర్శనలు, సోలో డ్యాన్స్ ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేదిక దగ్గర విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. వేదిక చివర అడ్డంగా కట్టిన రిబ్బన్ కట్ చేస్తున్న సమయంలో క్యూ స్టాండ్‌ తగిలి ఎమ్మెల్యే స్టేజ్ పై నుంచి జారి పడ్డారు. ఈ సమయంలో నేల మీద కాంక్రీట్ స్లాబ్‌కు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయినట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లీడర్ బర్త్‌డే కానుకగా లిక్కర్ బాటిల్..!
లీడర్ బర్త్‌డే కానుకగా లిక్కర్ బాటిల్..!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!