Sai Pallavi: మరో బాలీవుడ్ సినిమాను ఒకే చేసిన సాయి పల్లవి.. హీరోగా ఆ స్టార్ కిడ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 350 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీని తరువాత, ఆమె తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో తాండల్ చిత్రంలో నటిస్తుంది.
హీరోయిన్స్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అలాగే హిందీలోనూ అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గ విడుదలవుతున్నాయి. దాంతో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇతరభాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వాళ్ళ బాటలోనే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నడుస్తుంది. ఇప్పటికే ఈ చిన్నది హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హిందీలో రామాయణం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సీతగా నటిస్తుంది ఈ చిన్నది.
రణబీర్ కపూర్ ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ్ లోనూ నటిస్తుంది ఈ చిన్నది. తమిళ్ లో రీసెంట్ గా అమరన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. అలాగే ఇప్పుడు తెలుగులో కార్తీక్ దండు దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరు కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఇక ఇప్పుడు సాయి పల్లవి మరో హిందీ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.
తాజాగా సాయి పల్లవి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‌తో జతకట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ యొక్క లవ్ టుడే హిందీ రీమేక్ అయిన లవ్యప్పతో జునైద్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జునైద్ మరో సినిమాను ఓకే చేశాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వంవహిస్తుండగా.. నటుడు అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.