Tollywood: 7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ రెడీ.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ..

యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 7/జి బృందావన్ కాలనీ.. ఇక ఈ సినిమాకు రెండో భాగం రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు కూడా దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పుడు ఆసక్తికర టాక్ వినిపిస్తుంది.

Tollywood: 7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ రెడీ.. హీరోయిన్‌గా క్రేజీ బ్యూటీ..
7g Brindavan Colony
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 02, 2025 | 10:56 AM

ఇప్పటివరకు వచ్చిన సినిమాలంటిలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే టక్కున చెప్పే 7/జి బృందావన్‌ కాలనీ. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మించారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ నటించారు. ఇక ఈ సినిమా కథ మన పక్కన ఇంట్లోనో.. లేక మన వీరిలోనో జరిగే స్టోరీలా ఉంటుంది. ఈ సినిమా మొదట్లో ప్రేక్షకులకు అనంతగా ఎక్కలేదు.. ఆ తర్వాత మెల్లగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. 2004లో విడుదలైంది ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ సినిమాలకు దూరం అయ్యారు.

ఇక ఇప్పుడు 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. తాజాగా ఈ మూవీపోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరో  హీరోయిన్స్ ఎవరు నటిస్తున్నారని ప్రేక్షకులందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ అభిమానుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మొదటి భాగం విడుదలై పదేళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం ప్రకటించడం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

తాజాగా విడుదలలైన 7/జి బృందావన్‌ కాలనీ 2 పోస్టర్‌పై దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరామెన్ పేర్లను మాత్రమే రాశారు. ఈ పోస్టర్‌లో సినిమాలో నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమాలో మొదటి భాగంలో నటించిన రవికృష్ణ మరోసారి హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ నటి చేస్తుందని టాక్. మలయాళంలో ప్రముఖ నటి అనశ్వర రాజన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తారని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.