Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Beauty Tips: న్యూ ఇయర్ పార్టీలో అందంగా కనిపించాలనుకుంటే.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.. తక్షణ గ్లో పొందుతారు

కొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పనున్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుండగా మరికొందరు అంగరంగ వైభవంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇందుకోసం చాలా మంది పార్టీలకు, ఈవెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే పార్టీలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీ చర్మం పొడిగా ఉంటే పార్టీకి వెళ్లేటప్పుడు మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ చిట్కాలను పాటించవచ్చు.

Winter Beauty Tips: న్యూ ఇయర్ పార్టీలో అందంగా కనిపించాలనుకుంటే.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.. తక్షణ గ్లో పొందుతారు
Winter Beauty Tips
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2024 | 10:08 AM

కొత్త సంవత్సరం ప్రారంభానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కొత్త సంవత్సరానికి స్వాగతించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంత్సరానికి స్వాగతం చెప్పడానికి ఇష్టపడతారు. అదే సమయంలో మరికొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొంతమంది ఆ కార్యక్రమాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.

పార్టీలో స్టైలిష్‌గా కనిపించాలని దరిచే బట్టల దగ్గర నుంచి మేకప్ వరకు అన్నింటిపైనా శ్రద్ధ పెడతారు. అయితే ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా.. చర్మం ముఖ్యంగా ముఖం అందంగా మెరుస్తూ ఉంటే.. అప్పుడు మీ లుక్ పార్టీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. చలికాలంలో చాలా మంది చర్మం పొడిబారుతుంది. పొడిబారడం, చర్మం పై పగుళ్ళు ఏర్పడం వల్ల చర్మం మెరుపును కోల్పోతుంది. ఈ సమస్య ఉన్నవారు స్కిన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటారు లేదా పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటారు. అయితే మీరు ఇంట్లోనే కొన్ని చిట్కాలను అనుసరించి తక్షణ గ్లో పొందవచ్చు. ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన వస్తువులతో ఫేస్ మాస్క్‌ని తయారుచేసుకుని అప్లై చేసుకోవచ్చు.

తేనె ఫేస్ పేక్

చర్మం చాలా పొడిగా ఉంటే తేనె ఫేస్ మాస్క్ ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం ఒక చెంచా తేనెలో రెండు చెంచాల పచ్చి పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ముఖాన్ని శుభ్రపరచడానికి మాత్రమే కాదు ముఖం తేమగా ఉండే విధంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

కలబంద మాస్క్

శీతాకాలం లేదా వేసవి అయినా అలోవెరా ప్రతి సీజన్‌లో చర్మానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అందుకోసం 2 టీస్పూన్ల అలోవెరా జెల్, 1 టీస్పూన్ కొబ్బరినూనె , 1/2 టీస్పూన్ చందనం పొడిని మిక్స్ చేసి.. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ముఖంపై అప్లై చేయండి. దీని తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖం మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

అరటి పండు, తేనె

అరటి పండుని తీసుకుని మెత్తగా చేయాలి. దీని తరువాత.. అరటి పండు గుజ్జులో 1 టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ గా అప్లై చేయండి. ఇది పొడి చర్మానికి తేమను అందించడంలో, మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. అలాగే ముఖంలో మెరుపును తీసుకురావడానికి సహాయపడుతుంది.

అయితే ఈ చిట్కాలను పాటించే ముందు ఈ పదార్ధాల వలన అలెర్జీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ సహజ పదార్ధాల వలన అలెర్జీ సమస్య ఉంటే ముఖంపై వీటిని రాసుకోకూడదని గుర్తుంచుకోండి. అంతేకాదు ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోండి. స్క్రబ్ కూడా చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)