Uber Free Ride Offer : కీలక నిర్ణయం.. ఫ్రీ రైడర్ ఆఫర్ ఇస్తున్న ఉబెర్.. ఈ అవకాశం వారికి మాత్రమే
Uber Free Ride Offer : ఉబెర్ కారు ఉచితంగా బుక్ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లాలి. అంటే కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెల్లేవారికి ఉచిత రైడ్ ప్రయోజనం కల్పిస్తోంది..
Uber Free Ride Offer : ఉబెర్ కారు ఉచితంగా బుక్ చేసుకోవాలని భావించే వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లాలి. అంటే కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెల్లేవారికి ఉచిత రైడ్ ప్రయోజనం కల్పిస్తోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు తమ వంతు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబెర్ ప్రకటించింది.
పేదలకు, బలహీనవర్గాలకు చెందిన వారు, సీనియర్ సిటిజన్స్‌ను ఉచితంగానే ఉబెర్ కారులో కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లవచ్చని తెలిపింది. అయితే ఇందుకు ఒక ప్రక్రియ ఉంది. మీరు కారును ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.50 వరకు రైడ్ మాత్రమే ఉచితంగా లభిస్తోంది. కోవిడ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఉచిత రైడ్ అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది. రూ. 10 కోట్ల విలువైన ఉచిత రైడ్స్ అందిస్తామని ఉబెర్ ఇండియా మరియు దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రభుజీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ.50 లక్షల వరకు సీనియర్ సిటిజన్స్‌కు కేటాయించామని పేర్కొంది.ఉబెర్ దీని కోసం ప్రభుత్వాలతో కలిసి పనిచేయనుంది. కాగా, సీనియర్ సిటిజన్స్‌కు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా టీకా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్రం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుని కరోనా మహమ్మారి లేకుండా చేయాలని, వ్యాక్సినేషన్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలని ఉబెర్ కోరుతోంది.
కాగా, 2020 ఆగస్టులో ఉబెర్ ఆకలితో ఉన్నవారికి ఉచిత భోజనం అందించడంతో ఎంతగానో సహాయపడింది. ఇప్పుడు కరోనా టీకా విషయంలో సీనియర్ సిటిజన్స్‌కు ఉచిత ప్రయాణం కల్పిస్తూ వారి బాసటగా నిలుస్తోంది. అలాగే ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వాలంటీర్లకు ఉచిత రవాణా కల్పించింది.
ఇవీ చదవండి :
LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..