చిరిగిన జీన్స్ ధారణపై క్షమాపణ చెప్పిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్, కానీ…
మహిళలు మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్.. తన కామెంట్లకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా...
మహిళలు మోకాళ్ళ వద్ద చిరిగిన జీన్స్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్.. తన కామెంట్లకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటె తనను క్షమించాలన్నారు. అయితే జీన్స్ ధరించినా తనకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని, కానీ చిరుగుల జీన్స్ ధరించడాన్ని మాత్రం తాను అంగీకరించబోనని ఆయన చెప్పారు. ఈ రోజుల్లో పిల్లలు ఖరీదైన జీన్స్ ని కొనుగోలు చేసి ఇళ్లలో వాటికి చిరుగులు పెడుతున్నారని, ఇది తనను ఎంతో బాధిస్తోందని ఆయన చెప్పారు. అసలు రిప్డ్ జీన్స్ ధరించడం మన భారతీయ సంస్కృతికి చిహ్నమా అని ఆయన ప్రశ్నించారు. తాను గ్రామీణ కుటుంబం నుంచి వచ్చానని, తన చిన్నతనంలో తన ప్యాంట్ ఎప్పుడైనా చిరిగి ఉంటే టీచర్లు కొడతారని భయపడుతూ ఉండేవాడినన్నారు. వెంటనే అలా చిరిగిన ప్యాంటును మళ్ళీ కుట్టించి స్కూలుకు వెళ్ళేవాడినని ఆయన చెప్పారు. తీరత్ సింగ్ వ్యాఖ్యలపై ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు మండిపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయ బచ్చన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఇంకా చాలామంది ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలు కూడా ఆయన కామెంట్స్ పై భగ్గుమన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈ విధంగా మాట్లాడడం తగదన్నారు.
ఇలా ఉండగా ఈ ఎన్నికల సీజన్ లో ఓ బీజేపీ నేత, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడి వివాదం రేపడాన్ని బీజేపీ నాయకత్వం అసంతృప్తిని ప్రకటించింది. ఈ విధమైన వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తాయని భావించింది. హోమ్ శాఖ మంత్రి అమిత్ షా.. ఉత్తరాఖండ్ సీఎం తీరత్ ని పిలిపించి ఆయన సంజాయిషీని కోరుతున్నారు. ఓటర్లపై ఈ విధమైన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని అమిత్ షా అభిప్రాయపడుతున్నారు. మరిన్ని చదవండి ఇక్కడ :ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video. ‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో… ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )