మాస్క్ ధరించలేదన్నందుకు నడిరోడ్డుపై మహిళల సిగపట్లు…ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

ఈ కరోనా కాలంలో ముఖానికి మాస్క్ ధరించలేదని  ఓ మహిళను అడ్డగించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగినిపై  ఆ మహిళ దాడి చేసింది. ముంబై లోని కాందీవలి ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన...

  • Umakanth Rao
  • Publish Date - 12:36 pm, Sat, 20 March 21
మాస్క్ ధరించలేదన్నందుకు నడిరోడ్డుపై మహిళల సిగపట్లు...ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో
Why Are You Not Wearing Mask Says Mumbai Municipal Corporation Marshal

ఈ కరోనా కాలంలో ముఖానికి మాస్క్ ధరించలేదని  ఓ మహిళను అడ్డగించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగినిపై  ఆ మహిళ దాడి చేసింది. ముంబై లోని కాందీవలి ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడ మాస్క్ లేకుండా  ఓ ఆటోలో మహిళ వెళ్తుండగా  మహావీర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఆటో ఆగింది. ఆటోలో మాస్క్ లేకుండా ఈ మహిళను చూసిన కార్పొరేషన్ ఉద్యోగిని  ఒకరు వెంటనే ఆటో వద్దకు వచ్చి మాస్క్ ధరించనందుకు జరిమానాగా  200 రూపాయలు చెల్లించాలని కోరింది. అయితే ఇందుకు తిరస్కరించిన మహిళ ఆటో దిగి ఆమెను దుర్భాషలాడదాంతో ఇద్దరి  మధ్యా మాటా మాటా పెరిగింది. ఒకరికొకరు తోసుకున్నారు. ఉద్యోగినిపై ఆ మహిళ జుట్టు పట్టుకుని కొట్టడం,  ఇందుకు ఆమె కూడా ఎదురు దాడి చేయడంతో  పరిస్థితి తీవ్రమైంది. తాను జరిమానా చెల్లించేది లేదని సదరు మహిళ కేకలు పెట్టడం, ఇందుకు కార్పొరేషన్ ఉద్యోగిని కూడా ఆమెపై దాడికి పూనుకోవడంతో అంతా చుట్టూ మూగారు.

మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో రూల్స్ పాటించని వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహాప్రిస్తోంది. మాస్కు ధరించకపోతే 200 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్కరోజే కరోనా కేసులు చాలావరకు పెరిగాయి .
ముంబైలో ఒక్కరోజే సుమారు 3 వేల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా రాష్ట్రం మొత్తం మీద ఈ కేసుల సంఖ్య వరుసగా రెండో రోజున కూడా  25 వేలకు చేరింది. శుక్రవారం మహారాష్ట్రలో 1,77,560 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, పరిస్థితి ఇలాగె కొనసాగితే లాక్ డౌన్ విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రకటించారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న విషయం గమనార్హం .

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని చదవండి ఇక్కడ :ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video.
 ‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో… ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )