- Telugu News Photo Gallery India records highest single day covid 19 spike in four months witnesses more than 40000 new cases in national wide
India Corona Cases Updates: దేశంలో కరోనా విజృంభణ.. నాలుగు నెలల అనంతరం ఒక్క రోజులోనే భారీగా నమోదైన కేసులు..
India Corona Cases Updates: దేశంలో కరోనా విజృంభణ.. నాలుగు నెలల అనంతరం ఒక్క రోజులోనే భారీగా నమోదైన కేసులు..
Updated on: Mar 20, 2021 | 12:43 PM


ఇండియా కరోనా బులెటిన్‌ను శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 40,953 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన నాలుగు నెలల్లో ఇంతపెద్ద మొత్తం కేసులు నమోదువడం ఇదే తొలిసారి.


దేశ వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి. ఇక మహారాష్ట్రలోని ముంబైలో 3 వేలకు పైగా జనాలు కరోనా బారిన పడ్డారు. ఇది కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత నమోదైన కేసుల్లో అత్యధికం అని వైద్యాధికారులు చెబుతున్నారు.

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. పాఠశాలలను ప్రారంభించడంపై పునరాలోచనలో పడ్డాయి. అలాగే బహిరంగ సభలు, సమావేశాలు, గుంపులు గుంపులుగా గుమిగూడటంపైనా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ తమ జిల్లాల్లో లాక్‌డౌన్‌లు కూడా విధించాయి.

ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చే సందర్శకులకు ఆయా రాష్ట్రాల వైద్యాధికారులు ముందుగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో కోవిడ్ 19 టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.




