- Telugu News Photo Gallery Technology photos Instagram planning to bring new app for kids who under 13 years
Instagram For Kids: మరో అడుగు ముందుకేస్తోన్న ఇన్‌స్టాగ్రామ్.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా..
Instaram For Kids: యూత్‌ను టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చింది ఇన్‌స్టాగ్రామ్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తాజాగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను తీసుకురానుంది...
Updated on: Mar 20, 2021 | 4:32 AM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సోషల్ మీడియా సైట్లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. దీని మాతృ సంస్థ ఫేస్‌బుక్ అనే విషయం తెలిసిందే.

యూత్‌ను టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్.. ఫేస్‌బుక్‌కు అల్టర్‌నేటివ్‌గా బాగా ప్రాధాన్యత సంపాదించుకుంది.

ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల ఫాలోయింగ్ ఆప్షన్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఇది 13 ఏళ్ల లోపు చిన్నారులకు ఎంతో మేలు చేయనుంది.

ఇదిలా ఉంటే తాజాగా చిన్నారుల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఏకంగా కొత్త యాప్‌ను తీసుకురానుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ మొస్సెరీ తెలిపారు.

ఇప్పటికే ఫేస్‌బుక్‌లో అందుబాటులో ఉన్న 'మెసేంజర్ కిండ్స్'కు కొనసాగింపుగా ఈ యాప్‌ను తీసుకురానున్నారు.

చిన్నారులు వాడే ఈ యాప్‌పై పేరెంట్స్ కంట్రోలింగ్ ఎక్కువగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈయాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.





























