- Telugu News Photo Gallery Technology photos Find your lost smartphone in this way delete private data also can remotely from your phone
Find My Phone: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా?.. మరేం పర్వాలేదు ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టొచ్చు..
Find My Phone: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఇప్పుడిక భయపడాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టొచ్చు. ఒకవేళ దొరక్కపోయినా.. అందులోని ప్రైవేట్ డేటాను సులువుగా తొలగించవచ్చు.
Updated on: Mar 19, 2021 | 3:17 PM

స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ప్రత్యేక భాగంగా మారాయి. కారణం.. అందులో మనకు ఉపయోగకరమైన డేటా ఎంతో నిక్షిప్తం చేసుకుంటాం. వ్యక్తిగత సమాచారాన్ని సైతం మనం మన ఫోన్లలో దాచుకుంటాం. అలాంటి స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా కనిపించకుండా పోతే?.. ఇంకేముంది ప్రాణం పోయినంత పని అవుతుంది. తెగ టెన్షన్ పడిపోతాం. అందులోని డేటా ఎక్కడ దుర్వినియోగం అవుతుందో అని కంగారుపడిపోతాం. అయితే.. ఇప్పుడు ఫోన్ పోయినా కంగారు పడాల్సిన పనిలేదు. కనిపంచకుండా పోయిన ఫోన్‌ను ఫైండ్‌మై ఫోన్ యాప్ సలు పలు యాప్‌ల ద్వారా కనిపెట్టవచ్చు. ఒకవేళ ఫోన్ పోయినా.. మన డేటా మన చేతిలోనే ఉంటుంది. ఫోన్‌లోని డేటా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అందులోని డేటాను తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ మీ స్మార్ట్‌ఫోన్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించడమే కాకుండా, మీ డేటా భద్రంగా ఉంచే చర్యలు కూడా తీసుకుంది.

Find Mఫోన్‌ను కనుగొనడానికి ముందుగా.. android.com/find కి వెళ్లి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. ఇది ఇప్పటికే మీ ఫోన్‌లో లాగిన్ అయిన అదే గూగుల్ అకౌంట్ అయి ఉండాలి. అలా గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత.. డివైజ్‌లోని ఎడమవైపు కార్నర్‌లో రిజిస్టర్ చేయబడిన ఫోన్‌లు కనిపిస్తాయి. అక్కడ కనిపించకుండా పోయిన మీ ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలి. అలా ఇక్కడ మీరు మీ ఫోన్ బ్యాటరీ లెవెల్స్, ఆన్‌లైన్ స్థితిని చూడొచ్చు.y Phone 3

ఇక గూగుల్ మ్యాప్‌లో కనిపించకుండా పోయిన మీ స్మార్ట్ ఫోన్ స్థానాన్ని చూపిస్తుంది. ఒకవేళ రియల్‌టైమ్ మ్యాప్ చూపించకపోయినట్లయితే.. లాస్ట్ మిస్సింగ్ ప్లేస్‌ను చూడొచ్చు. అలా చివరి సారి మీ ఫోన్ మీ ఇంటి సమీపంలో లేదా, మరెక్కడైనా సమీపంలో మిస్ అయినట్లు గుర్తిస్తే మ్యాప్ సహాయంతో ఫోన్‌ను కనిపెట్టడం సులభతరం అవుతుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని మొత్తం డేటాను చూడటానికి, లాక్ చేయడానికి, తొలగించడానికి గూగుల్ సింపుల్ ప్రాసెస్‌ను తీసుకువచ్చింది. పిన్, పాస్‌కోడ్ సెట్ చేయడం ద్వారా ఫోన్‌ను కంట్రోల్ చేసి అందులోని ప్రైవేట్ డేటాను తొలగించొచ్చు. అందుకు గానూ గూగుల్ ఫైండ్ మై డివైజ్ యాప్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా మీ ఫోన్ మిస్ అయినా అందులోని డేటాను తొలగించొచ్చు. ఇంకా ఆ డేటాను శాశ్వతంగా తొలగించడమా? లేదా? అనేది ఆప్షన్ కూడా ఉంటుంది.




