- Telugu News Photo Gallery Technology photos Whatsapp facebook instagram down company released its statement know what was the problem
WhatsApp Down: వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ డౌన్.. కారణమిదేనంటూ క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం..
WhatsApp Down: వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ డౌన్ అవడానికి సాంకేతిక సమస్యలే కారణమని ఫేస్‌బుక్ ఇండియా ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. సాంకేతిక సమస్యల కారణంగా ఎదురైన ఇబ్బందులకు గానూ యూజర్లకు క్షమాపణలు చెప్పారు.
Updated on: Mar 20, 2021 | 3:00 PM

సోషల్ మీడియా సంస్థలైన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్‌లు తమ వినియోగదారులకు కాస్త ఝలక్ ఇచ్చాయనేచెప్పాలి. ఈ మూడు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు శుక్రవారం రాత్రి భారతదేశం అంతటా స్తంభించిపోయాయి. మెసేజ్‌లు పంపడంలో, స్వీకరించడంలో యూజర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమందికి వాట్సప్ వెబ్ కూడా లాగిన్ అవ్వలేదు. శుక్రవారం రాత్రి సరిగ్గా 10:45 నిమిషాలకు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ సర్వర్లు దాదాపు 45 నిమిషాలు డౌన్ అయ్యాయి.

వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ నిలిచిపోవడానికి గల నిర్ధిష్ట కారణాలను సదరు సంస్థ యాజమాన్యం వెల్లడించకపోయినప్పటికీ.. సాంకేతిక సమస్యల కారణంగానే వీటి సేవలకు అంతరాయం ఏర్పడిందని ఫేస్‌బుక్ ఇండియా ప్రతినిధి చెప్పారు. సాంకేతికంగా తలెత్తిన సమస్య కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. అయితే కాసేపటికే సమస్యను పరిష్కరించామని, వినియోగదారులకు కలిగిన అవాంతరానికి క్షమించాలంటూ వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

తమకు అందిన రిపోర్ట్ ప్రకారం.. సాంకేతిక సమస్య కారణంగా దేశ వ్యాప్తంగా సుమారు 28,500 మంది ఇన్‌స్టాగ్రమ్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారని, అలాగే 34,127 మంది వాట్సప్ వినియోగదారులు ఇబ్బంది పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఫేస్‌బుక్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

ఇక వాట్సప్ కనెక్షన్‌కు సంబంధించి 49 శాతం మంది యూజర్లు ఇబ్బందిపడినట్లు తెలిపారు. అలాగే 48 శాతం మంది వినియోగదారులు మెసేజ్‌లు పంపలేకపోవడం, స్వీకరించలేకపోవడం జరిగిందన్నారు.

ఇలాంటి సమస్యే 3 నెలల క్రితం కూడా సోషల్ మీడియా వినియోగదారులు ఎదుర్కొన్నారు. డిసెంబర్ 11, 2020 న, ఫేస్‌బుక్, మెసేంజర్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ సేవలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్‌స్టా సర్వర్లు డౌన్ అవడంతో యూజర్లు వెంటనే ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో తాము ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించారు.




