ముకేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసు, సీన్ రీకన్స్ట్రక్షన్, సచిన్ వాజేను నడిపించిన ఎన్ ఐ ఎ
ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు ఘటన కేసు దర్యాప్తు జోరుగా సాగుతోంది. గత ఫిబ్రవరి 24 న ఆయన నివాసం వద్ద జిలెటిన్ స్టిక్స్ ఉంచిన వాహనాన్ని కనుగొన్న కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను...
ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు ఘటన కేసు దర్యాప్తు జోరుగా సాగుతోంది. గత ఫిబ్రవరి 24 న ఆయన నివాసం వద్ద జిలెటిన్ స్టిక్స్ ఉంచిన వాహనాన్ని కనుగొన్న కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఇదే ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నిన్న రాత్రి ఏడున్నర గంటల కల్లా ఆ ప్రాంతాన్నంతా పోలీసులు, ఎన్ఐఏ అధికారులు తమ స్వాధీనం లోకి తీసుకుని దిగ్బంధం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు తమ వాహనాలతో సహా వఛ్చి ఆ ప్రదేశాన్నంతా కెమెరాలతో మొదట ఫోటోలు తీసుకున్నారు. ఆ రోడ్డు పొడవునా టేపుతో మార్క్ చేశారు. అనంతరం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో సచిన్ వాజేను అక్కడికి తీసుకువచ్చి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మొదట ఆయనను సాధారణ దుస్తులతో నడిపించారు. తరువాత పీపీఈ కిట్ ధరింప జెసి మళ్లీ వీడియోతో సీన్ రికార్డ్ చేశారు.
ఆరోజున ఒక వ్యక్తి తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఒక వ్యక్తి పీపీఈ కిట్ ధరించి సదరు వాహనాన్ని అక్కడ నిలిపి ఉంచిన దృశ్యాన్ని సీసీటీవీ ఫుటేజీలో కనుగొన్నారు. ఆవ్యక్తి సచిన్ వాజేయేనని ఆ తరువాత స్పష్టమైంది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను మళ్ళీ ఈ ప్రదేశానికి తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం విశేషం. ఇదంతా సుమారు మూడు గంటలపాటు సాగింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ వ్యవహారం ముగిసింది. అనంతరం సచిన్ వాజేను మళ్ళీ అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. అప్పటివరకు చుట్టుపక్కలవారిని ఎవరినీ పోలీసులు ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. ఇదంతా ముగిశాక ఆ ప్రాంతానికి మళ్ళీ ప్రజలను అనుమతించారు. ఈ ఘట్టం ఓ డ్రామాలా సాగడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు .
ఈ నెల వరకు 25 వరకు సచిన్ వాజే జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉంటారు. మరిన్ని చదవండి ఇక్కడ :ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video. ‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో… ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )