What India Thinks Today: త్వరలో చౌకైన ధరలకే 5G నెట్‌వర్క్‌ సేవలు.. టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌..

Ashwini Vaishnav:TV9 గ్లోబల్ సమ్మిట్ 'వాట్ ఇండియా టుడే' 2వ రోజు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రసంగించారు. ఇందులో భాగంగా బుల్లెట్ ట్రైన్, 5జీ నెట్‌వర్క్, 6జీ నెట్‌వర్క్, దేశంలో సెమీకండక్టర్ల తయారీ..

What India Thinks Today: త్వరలో చౌకైన ధరలకే 5G నెట్‌వర్క్‌ సేవలు.. టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌..
Ashwini Vaishnaw
Follow us

|

Updated on: Jun 18, 2022 | 1:11 PM

Ashwini Vaishnav:TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా టుడే’ 2వ రోజు కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రసంగించారు. ఇందులో భాగంగా బుల్లెట్ ట్రైన్, 5జీ నెట్‌వర్క్, 6జీ నెట్‌వర్క్, దేశంలో సెమీకండక్టర్ల తయారీ, 10 మిలియన్ల ఉద్యోగాల గురించి ఆయన మాట్లాడారు. అదేవిధంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన యువతకు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయవద్దని సూచించారు. ‘దేశంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 2014కి ముందు టెలికాం రంగం పరిస్థితి దారుణంగా ఉండేది. 2016లో మేం 4Gని ప్రారంభించాం. ఇప్పుడు మనం 2022లో 5Gని ప్రారంభించబోతున్నాం. 4జీ, 5జీల్లో మనం ప్రపంచానికి సమానంగా నిలబడాలి. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 20-25 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభిస్తాం. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే 10 రెట్ల తక్కువ ధరలకు 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇక 6జీ టెక్నాలజీకి ప్రధాని మోడీనే నాయకత్వం వహించాలని మేం కోరుకుంటున్నాం

2026లో బుల్లెట్‌ ట్రైన్‌..

‘మనదేశంలో రైల్వేలు విస్తృత సేవలను అందిస్తున్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రైల్వే చట్టాలను మరింత కఠినతరం చేయాలని నేను నమ్ముతున్నాను. రైల్వే ఆస్తులను పాడుచేయవద్దు. హింసకు పాల్పడవద్దని నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక బుల్లెట్‌ ట్రైన్‌కు సంబంధించి వాపి-అహ్మదాబాద్ మధ్య 60 కి.మీ మేర పిల్లర్లు ఏర్పాటు చేశాం. వంతెన పనులు కూడా కొనసాగుతున్నాయి. స్టేషన్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 సంవత్సరంలో మొదటి బుల్లెట్ రైలును నడుపుతాం. అలాగే వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. వీటి సగటు వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది.’

ఇవి కూడా చదవండి

సోషల్‌మీడియాను ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాం. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా స్టార్టప్‌లు కూడా పనిచేస్తున్నాయి. అదే సమయంలో డిజిటల్ జీవితంలో భద్రతపై మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే సమయంలో స్పామ్ కాల్స్ ను నియంత్రించేందుకు కొత్త నిబంధనలు తీసుకురానున్నాం. ఇలాంటి కాల్స్‌ లో KYC వివరాలు కనిపించేలా చర్యలు తీసుకోనున్నాం.

కోటి ఉద్యోగాలు..

త్వరలో భారత్ సెమీకండక్టర్‌ హబ్‌గా మారనుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒప్పందం జరుగుతుంది. మొదటి ఒప్పందం, ఫ్యాక్టరీ సెటప్ 2022 చివరి నాటికి సిద్ధంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ చిప్స్ తయారీ విషయంలో భారత్‌ ముందుండాలని ప్రపంచం కోరుతోంది. ఇక రానున్న 4-5 ఏళ్లలో ఈ రంగంలోనే కోటి ఉద్యోగాలు రానున్నాయి.. దీనితో పాటు ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గనున్నాయి.

రైల్వేలో పెట్టుబడులు పెరుగుతున్నాయి..

రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఏడేళ్లలో మూడున్నర లక్షల ఉద్యోగాలిచ్చాం. ఇది కాకుండా ప్రస్తుతం 1.5 లక్షల ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ‘డిమాండ్‌కి, సప్లయ్‌కి తేడా ఉంది. భారతదేశంలో 50-60 ఏళ్లుగా రైల్వేలో పెట్టుబడులు చాలా తక్కువ. 2014కి ముందు రైల్వేలో 45-50 వేల పెట్టుబడులు మాత్రమే ఉండేవి. 2014లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేలో పెట్టుబడులు పెరిగాయి. మా ప్రభుత్వ హయాంలో దాదాపు 90 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు పెరిగే కొద్దీ ఈ సమస్యలు పరిష్కారమవుతాయి’ అ ని అశ్విని వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..