National Politics: సంచలన కామెంట్స్ చేసిన మమతా బెనర్జీ.. జాతీయ రాజకీయాల్లో పెరిగిన పొలిటికల్ హీట్..

National Politics: నేషనల్ పాలిటిక్స్‌లో హీట్‌ పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా వ్యూహాలు రచిస్తున్నారు నేతలు. కాంగ్రెస్‌ ముగిసిన అధ్యాయమని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ..

National Politics: సంచలన కామెంట్స్ చేసిన మమతా బెనర్జీ.. జాతీయ రాజకీయాల్లో పెరిగిన పొలిటికల్ హీట్..
Mamatha Benerjee
Follow us

|

Updated on: Dec 02, 2021 | 5:43 AM

National Politics: నేషనల్ పాలిటిక్స్‌లో హీట్‌ పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా వ్యూహాలు రచిస్తున్నారు నేతలు. కాంగ్రెస్‌ ముగిసిన అధ్యాయమని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చకు దారితీశాయి. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు నేతలు. ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమికి పునాది వేస్తున్నారు మమతాబెనర్జీ – శరద్‌పవార్. కేంద్రంలో 2014కు ముందు రెండు సార్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఇప్పుడు మనుగడలో లేదన్నారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, దానిపై ఎవరూ పోరాడటం లేదని కామెంట్‌ చేశారు మమత. ఈ నేపథ్యంలో బలమైన ప్రత్యామ్నాయం అవసరం ఏర్పడిందని చెప్పారామె. శరద్ పవార్ చాలా సీనియర్ నాయకుడని, రాజకీయ పార్టీల విషయమై మాట్లాడేందుకు వచ్చాని స్పష్టం చేశారు బెంగాల్‌ సీఎం. శరద్ పవార్ చెప్పిన దానితో ఏకీభవిస్తున్నానని, నియంతృత్వంపై ఎవరూ పోరాడటం లేదు కాబట్టి బలమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందన్నారు మమతా బెనర్జీ.

ఇక, భావసారూప్యత కలిగిన పార్టీలు జాతీయ స్థాయిలో సంయుక్త నాయకత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు శరద్ పవార్. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు ఉంచాలని అభిప్రాయపడ్డారు ఎన్సీపీ అధినేత. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీనైనా స్వాగతిస్తామని స్పష్టం చేశారు పవార్. అది కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందన్నారాయన. అయితే, కాంగ్రెస్ మాత్రం ఈ పరిణామాలపై పెదవి విరిచింది. దేశ రాజకీయాల వాస్తవితక ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం కలేనని కామెంట్‌ చేశారు కేసీ. అటు వేణుగోపాల్ కామెంట్స్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు టీఎంసీ, ఎన్సీపీ నేతలు. కాంగ్రెస్‌ తనని తాను ఎక్కువగా ఊహించుకుంటోందని ఫైర్‌ అవుతున్నారు లీడర్లు.\

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..