Loco Pilot: చనిపోదామనుకుని రైలు పట్టాలపై పడుకున్నాడు.. కానీ లోకోపైలట్ ఏం చేశాడంటే..
ఆత్మహత్య చేసుకోవాలని రైలు ఎదురుగా వెళ్లాడో వ్యక్తి కానీ లోకోపైలట్ చురుగ్గా స్పందించడంతో అతడి ప్రాణాలు పోలేదు...

ఆత్మహత్య చేసుకోవాలని రైలు ఎదురుగా వెళ్లాడో వ్యక్తి కానీ లోకోపైలట్ చురుగ్గా స్పందించడంతో అతడి ప్రాణాలు పోలేదు. ఈ ఘటన మహారాష్ట్రంలో జరిగింది. వ్యక్తిని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన లోకోపైలట్ పై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రశంసలు కురిపించింది. దానికి సంబంధించిన ఫుటేజీని మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది.
ముంబై దగ్గర్లోని సెవ్రీ స్టేషన్‌కు రైలు వచ్చే సమయానికి ఓ వ్యక్తి పట్టాలపై తచ్చాడుతూ కనిపించాడు. పట్టాలు దాటతాడేమో అనుకుంటుండగానే.. వాటిపై పడుకున్నాడు. మరోపక్క రైలు చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక ఆ వ్యక్తి బతకడం అసాధ్యమని అన్నారు. కానీ దగ్గరగా వచ్చిన రైలు ఆగిపోయింది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని లోక్‌పైలట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేక్‌ను వాడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని పట్టాల మీద నుంచి పక్కకు తీసుకువచ్చారు.
ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటన నిన్న ఉదయం 11.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దానినిషేర్ చేస్తూ మంత్రిత్వ శాఖ లోకోపైలట్‌ను అభినందించింది.
मोटरमैन द्वारा किया गया सराहनीय कार्य : मुंबई के शिवड़ी स्टेशन पर मोटरमैन ने देखा कि एक व्यक्ति ट्रैक पर लेटा है उन्होंने तत्परता एवं सूझबूझ से इमरजेंसी ब्रेक लगाकर व्यक्ति की जान बचाई।
आपकी जान कीमती है, घर पर कोई आपका इंतजार कर रहा है। pic.twitter.com/OcgE6masLl
— Ministry of Railways (@RailMinIndia) January 2, 2022
Read Also.. Indian Railways: కరోనా మహమ్మారిలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ల ద్వారా రూ.511 కోట్ల ఆదాయం..!