Indian Railways: కరోనా మహమ్మారిలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్ల ద్వారా రూ.511 కోట్ల ఆదాయం..!

Indian Railways: 2020-21లో రైల్వేలు తత్కాల్ టిక్కెట్ ఛార్జీల ద్వారా రూ. 403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టిక్కెట్‌ల ద్వారా రూ. 119 కోట్లు, 'డైనమిక్' ఛార్జీల ద్వారా రూ. 511 కోట్లు..

Indian Railways: కరోనా మహమ్మారిలో తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టికెట్ల ద్వారా రూ.511 కోట్ల ఆదాయం..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2022 | 3:46 PM

Indian Railways: 2020-21లో రైల్వేలు తత్కాల్ టిక్కెట్ ఛార్జీల ద్వారా రూ. 403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టిక్కెట్‌ల ద్వారా రూ. 119 కోట్లు, ‘డైనమిక్’ ఛార్జీల ద్వారా రూ. 511 కోట్లు ఆర్జించాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా రైల్వే సేవలు చాలా వరకు నిలిపివేయబడ్డాయి. ఈ వివరాలను సమాచార హక్కు (ఆర్‌టీఐ) ప్రత్యుత్తరం ద్వారా ఈ సమాచారం అందింది. డిమాండ్‌కు అనుగుణంగా ఛార్జీలను నిర్ణయించే విధానాన్ని రైల్వేలో ‘డైనమిక్’ ఫేర్ సిస్టమ్ అంటారు. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ ఛార్జీల విధానం వర్తిస్తుంది. ఈ మూడు వర్గాల ప్రయాణికులు సాధారణంగా చివరి నిమిషంలో ప్రీమియం ఛార్జీలు చెల్లించి ఈ సేవలను పొందుతుంటారు ప్రయాణికులు. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి ఆర్‌టిఐకి సమాధానంగా ఆర్థిక సంవత్సరంలో ‘డైనమిక్’ ఛార్జీల ద్వారా రూ. 240 కోట్లు, తత్కాల్ టిక్కెట్‌ల ద్వారా రూ. 353 కోట్లు, ప్రీమియం తత్కాల్ ఛార్జీల ద్వారా రూ. 89 కోట్లు వసూలు చేసినట్లు రైల్వే తెలిపింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా చాలాని ఆర్జించింది రైల్వే. రైల్వే ‘డైనమిక్’ ఛార్జీల ద్వారా రూ. 1,313 కోట్లు, తత్కాల్ టిక్కెట్ల ద్వారా రూ. 1,669 కోట్లు మరియు ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల ద్వారా రూ. 603 కోట్లు వచ్చాయి. ఆ సమయంలో కరోనా గానీ, ఇతర ఇబ్బందేమి లేని కారణంగా ఆదాయం బాగానే వచ్చింది.

స్క్రాప్‌ విక్రయించడం ద్వారా రూ.402.5 కోట్లు సంపాదించారు. ఉత్తర రైల్వే రూ. 402.51 కోట్లను ఆర్జించి, స్క్రాప్ విక్రయాల్లో రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ.208.12 కోట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 93.40 శాతం ఎక్కువ. ఈ విధంగా, సెప్టెంబర్ 2021లో రూ.200 కోట్లు, అక్టోబర్ 2021లో రూ.300 కోట్లు మరియు డిసెంబర్ 2021లో రూ.400 కోట్ల స్క్రాప్ విక్రయాలు చేసింది రైల్వే శాఖ. అన్ని రైల్వే జోనల్ ఉత్పత్తి యూనిట్లలో ఉత్తర రైల్వే అగ్రస్థానంలో ఉంది.

నవంబర్ 2021లో రైల్వే బోర్డు ఇచ్చిన రూ. 370 కోట్ల స్క్రాప్ అమ్మకాల లక్ష్యాన్ని ఉత్తర రైల్వే కూడా సాధించింది. ఇతర జోనల్ రైల్వేలు మరియు ఉత్పత్తి యూనిట్లతో పోలిస్తే ఉత్తర రైల్వే ముందంజలో ఉంది. ఉత్తర రైల్వేలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన స్క్రాప్, పిఎస్‌సి స్లీపర్‌లను విక్రయించారు. తద్వారా ఆదాయాన్ని పొందడంతోపాటు రైలు సేవలను ఉపయోగించుకునేందుకు స్థలం కూడా ఖాళీ అయ్యింది.

ఇవి కూడా చదవండి:

Driving Licence: డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలా..? మీకో గుడ్‌న్యూస్‌.. ఇంట్లోనే ఉండి దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలాగంటే..!

Post Office scheme: పోస్టాఫీసులో అదిరిపోయే ఆఫర్‌.. ప్రతి నెల రూ.1500తో చేతికి రూ.35 లక్షలు.. పూర్తి వివరాలు!