AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price Today: డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోన్న టమాట.. ప్రస్తుతం కేజీ ధర ఎంతంటే..

దేశమంతటా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తరాదిన వర్షాలు జోరందుకోవడంతో మార్కెట్లలో టమాటా ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కిలో టమాట హోల్‌సేల్ ధర కిలో రూ.140 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో..

Tomato Price Today: డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోన్న టమాట.. ప్రస్తుతం కేజీ ధర ఎంతంటే..
Tomato Price
Srilakshmi C
|

Updated on: Jul 10, 2023 | 10:14 AM

Share

న్యూఢిల్లీ: దేశమంతటా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఉత్తరాదిన వర్షాలు జోరందుకోవడంతో మార్కెట్లలో టమాటా ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కిలో టమాట హోల్‌సేల్ ధర కిలో రూ.140 నుంచి రూ.160 వరకు పలుకుతోంది. రానున్న రోజుల్లో టమాటా ధర రూ.200 వరకు చేరవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాలలో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాల కారణంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఆకు కూరలు మొదలైన కూరగాయల ధరలు ఖరీదైనవిగా మారనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం తదితర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ తెలిపారు. ఫలితంగా ధరలు మరింత పెరగనున్నాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ సీజన్‌లో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్‌లను ఉత్తరాది రాష్ట్రాలు ప్రధాన సరఫరాదారుగా ఉన్నాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోతుండటంతో వినియోగదారులు పప్పు దినుసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరిగిన పప్పుల ధరలపైనా దీని ప్రభావం కనిపిస్తోందని సింగ్‌ పేర్కొన్నారు.

కాగా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో గత వారం భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. జూలై 8న ఢిల్లీలో కురిసిన వర్షం 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ప్రధాన రహదారులు మూసివేయడంతో పర్వత మార్గాల నుంచి పండ్లు, కూరగాయల రవాణా నిలిచిపోతుంది. భారీ వర్షాల కారణంగా ఉత్తర భారత రాష్ట్రాల నుంచి కురగాయల సరఫరా తగ్గే అవకాశం ఉన్నందున రానున్న వారం రోజుల్లో టమాట టోకు ధరలు కిలోకు రూ.140-150 పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రిలలో కేజీ టమాట ధర రూ.200 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. బెంగళూరులో కూడా ఈ ఏడాది పంట తగ్గింది. ఆగస్టు తర్వాత మాత్రమే టమోటా ధరలలో తగ్గుదల కనిపించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.