తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ కేసులో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు!

తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. జయరాజ్‌, బెనిక్స్‌ లాకప్‌ డెత్‌పై సమగ్ర విచారణ జరిపిన సీబీఐ మద్రాస్‌ హైకోర్టుకు అందచేసింది.

తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ కేసులో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు!
Balu

|

Oct 27, 2020 | 1:10 PM

తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. జయరాజ్‌, బెనిక్స్‌ లాకప్‌ డెత్‌పై సమగ్ర విచారణ జరిపిన సీబీఐ మద్రాస్‌ హైకోర్టుకు అందచేసింది. రిజల్ట్స్‌ ఆఫ్‌ లాబొరేటరి అనాలిసిస్‌ పేరుతో రూపొందించిన ఫోరెన్సిక్‌ రిపోర్టును మదురై ధర్మాసనానికి సమర్పించింది.. తండ్రీకొడుకులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని, రక్తం కారేట్టు కొట్టారని రుజువయ్యింది.. సత్తాన్‌కులం పోలీస్‌స్టేషన్‌లోని లాకప్‌, టాయిలెట్‌, ఎస్‌హెచ్‌ఓ గోడలపై సేకరించిన రక్త నమూనాలు, చనిపోయిన వారి డీఎన్‌తో సరిపోయినట్టు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది.. జూన్‌ 19 రోజున బెనిక్స్‌, జయరాజ్‌లను పోలీసులు దారుణమైన చిత్రహింసలకు గురి చేశారు.. పోలీసుల హింసలకు తాళలేక ఆ ఇద్దరూ అక్కడే కన్నుమూశారు.. సాయంత్రం నుంచి రాత్రి వరకు కొడుతూనే ఉన్నారు.. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించారంటే చివరకు బాధితుల గాయాల నుంచి, శరీరం నుంచి కారిన రక్తం ఫ్లోర్‌ మీద పడితే, దానికి కూడా వారి దుస్తులతోనే తుడిపించారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.. కోవిల్‌పట్టి మెజిస్ట్రేట్‌ విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలు కూడా ఇదే విషయాలను చెప్పినట్టు చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది సీబీఐ. ఈ ఏడాది జూన్‌ 19న ఎస్‌ఐ బాలకృష్ణన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌, కానిస్టేబుల్‌ ఎం.ముత్తరాజాలతో పాటు మరికొందరు పోలీసులు కామరాజార్‌ చౌక్‌ దగ్గర అకారణంగా జయరాజ్‌ను అరెస్ట్‌ చేశారు.. జయరాజ్‌ను పోలీసులు పట్టుకెళ్లారన్న విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు బెనిక్స్‌ వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.. అక్కడ తన తండ్రిని పోలీసులు కొడుతున్నది చూసి తట్టుకోలేకపోయారు.. తన తండ్రిని ఎందుకు కొడుతున్నారంటూ బాలకృష్ణన్‌ను అడిగారు.. ఆ మాత్రం దానికే పోలీసులకు కోపం వచ్చేసింది.. బెనిక్స్‌పై కూడా చేయి చేసుకున్నారు..పోలీసు దెబ్బల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్‌ను బెనిక్స్‌ వెనక్కి నెట్టారు.. దాంతో పోలీసులు ఇంకాస్త రెచ్చిపోయారు.. బెనిక్స్‌పై మూకుమ్మడి దాడి చేశారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు.. తండ్రీకొడుకుల దుస్తులు విప్పించారు.. చెక్కబల్లపై పడుకోబెట్టి, కాళ్లూ చేతులూ వెనక్కి మడిచిపెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు.. తమను విడిచిపెట్టమంటూ బతిమాలుకున్నా పోలీసులు కరగలేదు.. ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు.. ఆ దెబ్బలను తట్టుకోలేక తండ్రీకొడుకులిద్దరూ అక్కడే చనిపోయారు..ఈ లాకప్‌డెత్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల చర్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu