AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంతిభద్రతల పరిరక్షణ చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి…!

పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌-పీడీఎం నిర్వహించే సమావేశానికి మిలిటెంట్ల నుంచి ముప్పు ముందని పాకిస్తాన్‌ నేషనల్ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ హెచ్చరించినప్పటికీ పీడీఎం కూటమి నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు..

శాంతిభద్రతల పరిరక్షణ చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి...!
Balu
|

Updated on: Oct 26, 2020 | 1:07 PM

Share

పాకిస్తాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్‌-పీడీఎం నిర్వహించే సమావేశానికి మిలిటెంట్ల నుంచి ముప్పు ముందని పాకిస్తాన్‌ నేషనల్ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ హెచ్చరించినప్పటికీ పీడీఎం కూటమి నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.. భారీ ర్యాలీ తీశారు.. అయితే ఎన్‌సీటీఎ చెప్పినట్టుగానే సమావేవం అనంతరం అక్కడ బాంబులు పేలాయి.. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు..విపక్ష కూటమి నిర్వహించిన సభా స్థలికి దగ్గరలోనే బాంబు పేలడం గమనార్హం.. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పీడీఎం గత నెల 20న ఏర్పాటయ్యింది.. ఇమ్రాన్‌ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ విపక్ష కూటమి ఇప్పటికే లాహోర్‌, కరాచీ నగరాలలో రెండు భారీ ర్యాలీలను నిర్వహించింది.. ర్యాలీల అనంతరం జరిగిన భారీ బహిరంగ సమావేశంలో ఇమ్రాన్‌ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు విపక్ష నేతలు.. ఇక నిన్న బెలూచిస్థాన్‌ ప్రాంతంలోని క్వెట్టాలో మరో భారీ ర్యాలీని నిర్వహించింది పీడీఎం.. ఈ ర్యాలీకి కూడా జనం పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం.. పాకిస్తాన్‌ మిలటరీ రిగ్గించి చేసి ఇమ్రాన్‌ను అధికారంలోకి తెచ్చిందని విపక్ష కూటమి నేతలు ఆరోపించారు.. దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని ఇమ్రాన్‌ను ఎద్దెవా చేశారు పీడీఎం అధ్యక్షుడు, జామియత్‌ ఈ ఇస్లామ్‌ నేత మౌలానా ఫజ్లుర్‌ రహ్మన్‌! లండన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావెద్‌ బెజ్వాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ నుదిటి రేఖను మార్చాల్సిన సమయం ఆస్నమయ్యిందని అన్నారు పీఎంఎల్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌.. బెలూచిస్థాన్‌ ప్రజలపై దాష్టికాలు కొనసాగవన్నారు..భర్తల జాడ తెలియక భార్యలు, సోదరుల జాడ తెలియక అక్క చెల్లెళ్లు ఆవేదన చెందుతున్నారని, దీనికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అన్నారు. అయితే పీడీఎం చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండిస్తున్నారు. తను ప్రధానమంత్రి కావడానికి ఆర్మీ సాయం చేసిందనడం అవాస్తవమన్నారు.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో