Bengaluru: ఆడుకుంటూనే తీవ్ర అస్వస్థతకు గురైన మూడేళ్ల బాలుడు.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్..!

Bengaluru: చిన్న పిల్లలతో తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పే అని చెప్పాలి. వారి అల్లరిని కంట్రోల్ చేయాలంటే నానా అవస్థలు పడాల్సి ఉంటుంది.

Bengaluru: ఆడుకుంటూనే తీవ్ర అస్వస్థతకు గురైన మూడేళ్ల బాలుడు.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్..!
Lord Ganesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2021 | 2:29 PM

Bengaluru: చిన్న పిల్లలతో తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పే అని చెప్పాలి. వారి అల్లరిని కంట్రోల్ చేయాలంటే నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. వద్దన్న పనిని కావాలని మరీ చేసి చూపిస్తుంటారు చిచ్చర పిడుగులు. అటు తిరిగి ఇటు చూసే లోపు.. అంతా రచ్చ రచ్చ చేసిపెడతారు. అయితే, ఒక్కోసారి వారు చేసే అల్లరి పనులు వారిని ప్రమాదాల బారిన పడేస్తుంటాయి. అది ప్రాణాల మీదకు తీసుకువస్తుంటాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ బాలుడు ఇలాంటి ఉపద్రవమే కొనితెచ్చుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మూడేళ్ల పిల్లాడు.. 5 సెంటీమీటర్ల పొడవైన గణేషుడి విగ్రహాన్ని మింగేశాడు. దాంతో అది కాస్తా అన్నవాహికకు అడ్డంగా చిక్కుకుపోయింది.

విగ్రహం గొంతులోకి పోవడంతో ఆ బాలుడి ఛాతిలో తీవ్రమైన నొప్పి కలిగింది. తినడానికి, తాగడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. ఆ పిల్లాడికి ఛాతి, గొంతు ఎక్స్‌-రే తీయగా.. గణేషుడి విగ్రహం కనిపించింది. దాంతో ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. వెంటనే ఆ పిల్లాడిని పాత విమానాశ్రయం రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎండోస్కోపిక్ విధానంతో అన్నవాహికలో ఇరుక్కుపోయిన విగ్రహాన్ని తొలగించారు. దానికి బయటకు తీయడానికి దాదాపు గంటపాటు శ్రమించారు వైద్యులు. విగ్రహాన్ని బయటకు తీసిన తరువాత 3 గంటల పాటు ఆ బాలుడిని పరిశీలించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు.

కాగా, గొంతులో ఇరుక్కున్న విగ్రహం.. అన్నవాహికను గాయపరిచే ఛాన్స్ ఉందని పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అన్నవాహికకు చిల్లులు పడే ప్రమాదం ఉందన్నారు. విగ్రహాన్ని మింగడం ద్వారా పిల్లాడు చాలా ఇబ్బంది ఎదుర్కొ్న్నాడని ఆయన తెలిపారు. సమయం వృథా చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకురావడం వల్ల బాలుడు సురక్షితంగా ఉన్నాడని తెలిపారు. కాగా, తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రమాదకరం అయిన వాటికి దూరంగా ఉంచాలని వార్నింగ్ ఇచ్చారు.

Also read:

Tungabhadra inflow: తుళ్లి పడుతున్న తుంగభద్రమ్మ.. డ్యామ్‌లో భారీగా వస్తున్న ఇన్‌ఫ్లో

Tokyo Olympics 2020: బాక్సింగ్‌లో మేరీ కోమ్‌ శుభారంభం.. ఫ్లై వెయిట్ రౌండ్ 32లో విజయం

Congress politics: మొన్న పంజాబ్‌.. ఇవాళ రాజుకుంటున్న రాజస్తాన్.. కాంగ్రెస్‌ పెద్దల రాజీ ప్రయత్నాలు