Congress politics: మొన్న పంజాబ్‌.. ఇవాళ రాజుకుంటున్న రాజస్తాన్.. కాంగ్రెస్‌ పెద్దల రాజీ ప్రయత్నాలు

మొన్న పంజాబ్‌..ఇవాళ రాజస్థాన్. సర్దార్ల మధ్య రాజీ కుదిర్చిన అధిష్టానం..రాజస్థాన్‌లో వర్గ పోరుకు తెరదించడంపై ఫోకస్‌ పెట్టింది. పార్టీలో అంతర్గత విభేధాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

Congress politics: మొన్న పంజాబ్‌.. ఇవాళ రాజుకుంటున్న రాజస్తాన్.. కాంగ్రెస్‌ పెద్దల రాజీ ప్రయత్నాలు
Sachin Pilot And Cm Ashok G
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 25, 2021 | 2:07 PM

మొన్న పంజాబ్‌..ఇవాళ రాజస్థాన్. సర్దార్ల మధ్య రాజీ కుదిర్చిన అధిష్టానం..రాజస్థాన్‌లో వర్గ పోరుకు తెరదించడంపై ఫోకస్‌ పెట్టింది. పార్టీలో అంతర్గత విభేధాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలకు తెరదించేందుకు కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో కేబినెట్‌ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో తిరుగుబాటు చేసి చల్లబడిన సచిన్‌ పైలట్‌ వర్గాన్ని సంతృప్తి పరిచే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ మేరకు కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌, రాజస్థాన్ ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ ఆధర్వంలో జైపూర్‌లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 27 లేదా 28న క్యాబినెట్‌ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గత నెల యూపీకి చెందిన కీలక నేత జితిన్‌ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి కాషాయకండువా కప్పుకోవడంతో.. సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచిన్‌ను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు లేకపోతే కాంగ్రెస్‌ మరో యువనేతను కూడా కోల్పోవాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి.

అదే సమయంలో పైలట్‌ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వల్ల.. అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికే వెళ్లారంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, వాటిని తోసిపుచ్చిన ఆయన.. అధిష్ఠానంతో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయన్నారు. తన డిమాండ్లపై పార్టీ త్వరలో సరైన నిర్ణయం తీసుకోనుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని

Bigg Boss Fame Yashika: చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బిగ్‌బాస్ ఫేమ్ నటి యాషికకు తీవ్ర గాయాలు..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!