AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Haryana High Court: సహ జీవనంపై సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు.. వారికి ఆ హక్కు ఉందంటూ స్పష్టం చేసిన ధర్మాసనం..

Punjab Haryana High Court: వయోజనులైన(మేజర్లు) యువతి, యువకుడు తమ ఇష్టపూర్వకంగా సహజీనం చేసే హక్కు ఉందని పంజాబ్..

Punjab Haryana High Court: సహ జీవనంపై సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు.. వారికి ఆ హక్కు ఉందంటూ స్పష్టం చేసిన ధర్మాసనం..
Punjab Haryana High Court
Shiva Prajapati
|

Updated on: Jul 25, 2021 | 2:28 PM

Share

Punjab Haryana High Court: వయోజనులైన(మేజర్లు) యువతి, యువకుడు తమ ఇష్టపూర్వకంగా సహజీనం చేసే హక్కు ఉందని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పస్టం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి గానీ, ఇతరుల నుంచి గానీ హానీ ఉన్నట్లయితే వారికి రక్షణ కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. చండీగఢ్ ప్రాంతానికి చెందిన యువతి(18), మొహాలికి చెందిన యువకుడు(20) ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. దాంతో ఆ యువతి తాను ప్రేమించిన యువకుడితో ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే, యువతి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలిస్తుండగా.. వారు వివిధ ప్రాంతాలలో తలదాచుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా అయితే కష్టం అని భావించిన ఆ ప్రేమ జంట.. పోలీసులను ఆశ్రయించింది. ఫలితం లేకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా కోరారు.

వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. సహజీవనం చేయడానికి వీరికి హక్కు ఉందని స్పష్టం చేసింది. ‘పిటిషనర్లు ఇద్దరూ మేజర్స్ అయినందున వారి ఇష్టప్రకారం జీవించే హక్కు వారికి ఉంది. స్వేచ్ఛగా జీవించడానికి, వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అర్హులు. వారిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కావున.. వారు కలిసి జీవించే హక్కు ఉంటుంది’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. పోలీసులు.. ఈ జంటకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే, పెళ్లికి ముందే సహజనం నైతికంగా, సామాజికంగా సరైంది కాదని, తమ కూతురుని తమకు అప్పగించాలని ఆ యువతి కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

కాగా, ఇదే కోర్టు గతంలో వివాహేతర సంబంధాలపై కీలక తీర్పును వెలువరించింది. వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన స్త్రీ చెడ్డ తల్లిగా నిర్ధారించబడదని, పిల్లలను తల్లివద్దే ఉంచకూడదని చెప్పడానికి ఇది సరైన కారణం కాదంటూ ఓ కేసులో హర్యానా, పంజాబ్ హైకోర్టు తీర్పునిచ్చింది.

Also read:

GVL Narasimha rao: ఆర్థిక మంత్రా.. అప్పుల మంత్రా.. బుగ్గనాపై ఎంపీ జీవీఎల్ సంచలన కామెంట్స్..

Viral News: సడెన్‌గా ఎదుటకొచ్చిన మొసలి.. భయంతో పరుగులు తీసిన మహిళ.. అసలు విషయం తెలిసి నవ్వుకున్న పోలీసులు..

Bengaluru: ఆడుకుంటూనే తీవ్ర అస్వస్థతకు గురైన మూడేళ్ల బాలుడు.. అది చూసి షాక్ అయిన వైద్యులు..