Viral News: సడెన్‌గా ఎదుటకొచ్చిన మొసలి.. భయంతో పరుగులు తీసిన మహిళ.. అసలు విషయం తెలిసి నవ్వుకున్న పోలీసులు..
Viral News: మన దారిన మనం నచుకుంటూ వెళ్తుంటే హఠాత్తుగా ఒక క్రూర జంతువు, మొసలి వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? దాదాపుగా అందరూ..
Viral News: మన దారిన మనం నచుకుంటూ వెళ్తుంటే హఠాత్తుగా ఒక క్రూర జంతువు, మొసలి వంటివి కనిపిస్తే ఏం చేస్తారు? దాదాపుగా అందరూ హడలిపోతారు. ఒక్కసారిగా అలాంటి వాటిని చూస్తే గుండె ఆగినంత పని అవుతుంది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాం. సాధ్యమైనంత వరకు ప్రాణాలు దక్కించుకోవాలనే ఆత్రుతలో అక్కడి నుంచి జంప్ అవుతాం. అచ్చం ఇలాంటి ఘటనే కొలంబియాలోని ఓ ఇంట్లో జరిగింది. ఒక్కసారిగా మొసలిని చూసిన మహిళ భయంతో పరుగులు తీసింది. ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులకు ఫోన్ చేసి పిలిపించింది.
ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. కొలంబియాలోని ఓ భవనంలో మహిళ నివసిస్తోంది. తాను ఇంటి తలుపులు తెరిచి బయటకు రాగానే.. ఎదురుగా మొసలి కనిపించింది. దాంతో హడలిపోయిన ఆ మహిళ భయంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసింది. అటు పక్కన ఉన్న మెట్ల కింద దాక్కుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన తమ భవనంలోకి మొసలి వచ్చిందని, తమను రక్షించాలంటూ పోలీసులను వేడుకుంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. మహిళ చెప్పిన అడ్రస్‌కు వచ్చారు. అక్కడ ఉన్న దానిని చూసి నిజమైన మొసలే అని తొలుత భావించారు. అయితే దగ్గరకు వచ్చి చూడగా.. అది నిజమైన మొసలి కాదని నిర్ధారించుకుని షాక్ అయ్యారు. అది ఉత్త బొమ్మ అని, నిజమైన మొసలి కాదని పోలీసులు గ్రహించి నవ్వుకున్నారు. ఎవరో కావాలని ఆమెను భయపెట్టేందుకు చేసిన పని భావించి పోలీసులు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ఈ ఫేక్ మొసలి ఫోటోను పోలీసు అధికారి జాసన్ డౌసెట్ ట్వీట్ చేశాడు. జరిగిన ఫన్నీ ఘటనను వివరించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌ను చూసి నెటిజన్లు సైతం నవ్వుకుంటున్నారు. పాపం అంటూ ఆ మహిళకు సింపతీ ప్రకటిస్తున్నారు.
Viral Pic:
7am: Officers called to high rise condo to help ‘hysterical’ resident stuck in stairwell where she just came face to face with alligator.
Prior to arrival, alligator confirmed as a realistic fake ?. Phew. pic.twitter.com/An2inrBCUB
— Jason Doucette (@JDoucette2050) July 22, 2021
Also read:
Bengaluru: ఆడుకుంటూనే తీవ్ర అస్వస్థతకు గురైన మూడేళ్ల బాలుడు.. అది చూసి షాక్ అయిన వైద్యులు..
Tungabhadra inflow: తుళ్లి పడుతున్న తుంగభద్రమ్మ.. డ్యామ్‌లో భారీగా వస్తున్న ఇన్‌ఫ్లో
Tokyo Olympics 2020: బాక్సింగ్‌లో మేరీ కోమ్ శుభారంభం.. ఫ్లై వెయిట్ రౌండ్ 32లో విజయం