Tamilnadu: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని మిషన్ కట్టర్‌తో నరికి చంపిన మహిళ
తమిళనాడులో ఈరోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. అంతరంగ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానిని బెదిరించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మహిళ దారుణంగా అంతమొందించింది.
తమిళనాడులో ఈరోడ్‌లో దారుణం చోటు చేసుకుంది. అంతరంగ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానిని బెదిరించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మహిళ దారుణంగా అంతమొందించింది. దుంగలు కట్ చేసే కట్టర్ మెషిన్ తో వ్యాపారిని నరికి చంపింది. అతని శరీర భాగాలని ముక్కలు, ముక్కలుగా చేసి వాటిని నగరంలో అక్కడక్కడా పడేసింది. మృతుడి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా పోలీసులకు కోయంబత్తుర్ లో అక్కడక్కడ శరీర భాగాలు దొరికాయి. ఇవి మిస్సింగ్ అయిన వ్యాపారివేనని గుర్తించడంతో ప్రధాన నిందితురాలు కవిత తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈరోడ్ కి చెందిన ప్రభు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఈ నెల 15 వతేది నుంచి అతను కనబడటం లేదని భార్య పోలీసులను ఆశ్రయించింది.
ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులకు మృతుడితో కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని గుర్తించారు. అయితే తనని పెళ్లిచేసుకోమని అడిగితే తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని ప్రభు బెదిరించాడు. దీంతో ప్రభు ని మిషన్ కట్టర్ తో నరికి చంపింది కవిత. అనంతరం అతని శరీర భాగాలని అక్కడక్కడా పడేసినట్లు విచారణలో కవిత అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..