Indian Railways: తెలుసా..! ఈ ట్రైన్‌లో టికెట్‌ లేకున్నా ఎంతదూరమైన ప్రయాణించవచ్చు.. టైమింగ్స్‌ ఇవే..

మన దేశంలో ఒక ట్రైన్‌ మాత్రం గత 73 ఏళ్ల నుంచి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లొచ్చన్నమాట..

Indian Railways: తెలుసా..! ఈ ట్రైన్‌లో టికెట్‌ లేకున్నా ఎంతదూరమైన ప్రయాణించవచ్చు.. టైమింగ్స్‌ ఇవే..
Indian Railways
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 16, 2023 | 1:57 PM

సాధారణంగా తక్కువ బడ్జెట్‌లో ప్రయాణం చేయాలనుకునే వారికి మొదటి ఎంపిక రైలు అవుతుంది. ఐతే మన దేశంలో ఒక ట్రైన్‌ మాత్రం గత 73 ఏళ్ల నుంచి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. అంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లొచ్చన్నమాట. అవును.. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు మార్గాల్లో నడిచే భాక్రా-నంగల్ ట్రైన్‌ ఈ సదుపాయం కల్పిస్తోంది. దాదాపు 25 గ్రామాలకు 300ల మంది ప్రయాణికులు నిత్యం టికెట్‌ కొనకుండా ఉచితంగా ప్రయాణిస్తుంటారు. ఇక టీసీలు అసలే కనిపించరు.

13 కిలోమీటర్ల మేర ప్రయాణించే ఈ ట్రైన్‌ స్థానికంగా స్కూల్‌ విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7:05 గంటలకు బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. మళ్లీ నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 గంటలకు బయలుదేరి, సాయంత్రం 4:20 గంటలకు భాక్రాకు చేరుకుంటుంది. ఇలా రోజుకు రెండే సర్వీసులు ఉంటాయి.

భాక్రా-నంగల్ రైలు మార్గం పనులు 1948లో ప్రారంభంకాగా 1963లో పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్ట్రెయిట్ గ్రావిటీ డ్యామ్‌గా దీనికి పేరు. ఈ ట్రైన్‌ మొదట ఆవిరితో నడిచేది. ఆ తర్వాత 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న మూడు కొత్త ఇంజన్లను అమర్చి సాంకేతిక మరమ్మత్తులు చేశారు. అయినప్పటికీ ఈ ట్రైన్‌ మోడల్‌ 60 ఏళ్ల నాటి మోడల్‌ను పోలి ఉంటుంది. భాక్రా-నంగల్ ట్రైన్‌ గంటకు 18 నుంచి 20 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతుంది. ఖర్చలు భరించలేక ఈ ట్రైన్‌ను నడుపుతున్న భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ (BBMB) 2011లో ఖర్చుల కారణంగా ఉచిత ప్రయాణ సేవలకు ముగింపు పలికేందుకు నిర్ణయం తీసుకుంది. ఐతే ఈ రైలు కేవలం ఆదాయ వనరు కంటే ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి, వారసత్వాలకు ప్రతీకగా భావించి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఇప్పటికీ ఈ ట్రైన్‌లో ఉచిత ప్రయాణాలు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.