Telangana Crime News: షాకింగ్..! హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్ కిడ్నాప్.. ఇంతకీ ఎవరు చేశారంటే..

ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా కిడ్నాపర్లను గుర్తించి, అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకున్న..

Telangana Crime News: షాకింగ్..! హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్ కిడ్నాప్.. ఇంతకీ ఎవరు చేశారంటే..
TSRTC bus driver kidnapped
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 16, 2023 | 12:25 PM

ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా కిడ్నాపర్లను గుర్తించి, అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన వెంకటేశ్ దిల్‌సుఖ్ నగర్-2 డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన నవీన్ వద్ద కొంత కాలం వెంకటేశ్ స్నేహితుడికి హామీ కింద అప్పు ఇప్పించాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌ స్నేహితుడు తీసుకున్న అప్పు నవీన్‌కు సకాలంలో పూర్తిగా చెల్లించలేదు. పైగా ఫోన్‌ చేసిన స్పందించడం లేదు.

దీంతో ఆగ్రహానికి గురైన నవీన్ తన స్నేహితులతో కలిపి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌ను కిడ్నాప్ చేయించాడు. వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్రాప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఆ ఏరియాలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించి, అరెస్ట్‌ చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను విచారించి పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఓ పోలీసధికారి మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!