Part Time Lecturer Jobs 2023: తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్‌టైం లెక్చరర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో.. ఇంగ్లిష్, ఉర్దూ, లా సబ్జెక్టుల్లో పార్ట్‌టైం లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

Part Time Lecturer Jobs 2023: తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్‌టైం లెక్చరర్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Telangana University
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 16, 2023 | 3:35 PM

తెలంగాణ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో.. ఇంగ్లిష్, ఉర్దూ, లా సబ్జెక్టుల్లో 8 పార్ట్‌టైం లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే యూసీజీ- నెట్‌/సెట్‌/స్లెట్‌లో అర్హత లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించకుండా ఉండాలి. అంటే జనవరి 2, 1993 నుంచి జనవరి 1, 2002 మధ్య జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 18, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

The Principal, University College of Arts and Science, Telangana University, Main Campus, Dichpally, Nizamabad.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.