Income Tax Jobs 2023: రాత పరీక్షలేకుండా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా జాబ్‌

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్.. 73 ట్యాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌, ట్యాక్స్ అసిస్టెంట్‌, మల్టీటాస్కింగ్‌స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్పోర్ట్స్‌ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Income Tax Jobs 2023:  రాత పరీక్షలేకుండా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు నేరుగా జాబ్‌
Income Tax Department
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 16, 2023 | 3:20 PM

కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్.. 73 ట్యాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌, ట్యాక్స్ అసిస్టెంట్‌, మల్టీటాస్కింగ్‌స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్పోర్ట్స్‌ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకైతే డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత స్పోర్ట్స్‌లో (అథ్లెటిక్స్‌, బ్యాట్మెంటన్‌, బాస్కెట్‌బాల్‌, బాడీ బిల్డింగ్, క్యారెమ్స్‌, చెస్‌, క్రికెట్‌, ఫుడ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ తదితర స్పోర్ట్స్‌) రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్పోర్ట్స్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,200ల నుంచి రూ.34,800ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ట్యాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌ పోస్టులు: 28
  • ట్యాక్స్ అసిస్టెంట్‌ పోస్టులు: 28
  • మల్టీటాస్కింగ్‌స్టాఫ్‌ పోస్టులు: 16

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.