India – Pakistan: ఒక్క గ్రామం కోసం.. ఏకంగా 12 గ్రామాలను పాకిస్తాన్‌కు ఇచ్చేసింది భారత్.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..
India - Pakistan: స్వాతంత్య్రం వచ్చింది ఇప్పటికీ భారత్, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అది, ఇది అనేదేం లేదు..
India – Pakistan: స్వాతంత్య్రం వచ్చింది ఇప్పటికీ భారత్, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అది, ఇది అనేదేం లేదు.. చిన్న కారణం దొరికితే చాలు ఇరు దేశాలు పరస్పరం కాలుదువ్వేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా కశ్మీర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు దేశాల మధ్య వివాదం ఇంకా కొనసాగడానికి ప్రధాన కారణం కశ్మీర్ అనే చెప్పాలి. ఈ వివాదాల నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే.. ఈ వివాదాల మాట అటుంచితే.. ఒక విషయంలో మాత్రం భారత్ కాంప్రమైజ్ అయ్యి.. ఒక్క గ్రామం కోసం ఏకంగా 12 గ్రామాలను పాకిస్తాన్‌కు ఇచ్చేసింది. అవును.. మీరు విన్నది నిజమే.. కేవలం ఒక్క గ్రామం కోసం 12 గ్రామాలను వదులుకుంది భారత ప్రభుత్వం. అయితే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. మరి ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో హుస్సేనివాలా అనే గ్రామం ఉంది, ఇది ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. షాహీద్-ఎ-అజామ్ భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల సమాధులు ఈ గ్రామంలోనే ఉన్నాయి. భగత్ సింగ్ సహచరుడు బతుకేశ్వర్ దత్ సమాధి కూడా ఇక్కడ ఉంది. అలాగే, పంజాబ్ మాతా బిరుదు పొందిన భగత్ సింగ్ తల్లి విద్యావతి దేవి సమాధి కూడా ఈ గ్రామంలోనే ఉంది. అయితే ఈ గ్రామం దేశ విభజన అనంతం పాక్ భూభాగంలోకి వెళ్లిపోయింది. దాంతో భారతదేశం తన 12 గ్రామాలను పాకిస్తాన్ ఇచ్చి.. ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుంది. ఈ గ్రమంలో స్వతంత్ర సమరయోధులు, అమరవీరుల గుర్తులు ఉండటం, భారతదేశ స్వంతత్రం పోరాట చరిత్రలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉండటంతో, చారిత్రక ప్రదేశం కావడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. వీరి త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారిలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ప్రముఖులు. ఈ వీరుల సమాధులు హుస్సేనివాలా గ్రామంలో ఉండటంతో మరోసారి ఈ గ్రామం వార్తల్లోకెక్కింది. ముగ్గురు వీరులు అమరులైన మార్చి 23వ తేదీన ఈ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలి వస్తారు.
అర్థరాత్రి గుట్టుచప్పుడు కాకుండా.. భారతదేశంలో బ్రిటీష్ పాలనను వ్యతిరేకిస్తూ భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు నాటి కేంద్ర అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన బ్రిటన్ ప్రభుత్వం.. వారికి ఉరి శిక్ష విధించింది. అయితే నిర్ణీత రోజున వారిని ఉరి తీస్తే.. జనాగ్రహాన్ని తట్టుకోవడం కష్టం అని భావించిన బ్రిటీష్ పాలకులు.. లాహోల్ జైలులో ఉన్న ముగ్గురు వీరులను గుట్టు చప్పుడు కాకుండా మార్చి 23వ తేదీన ఉరి తీశారు. అదే రోజున అర్థరాత్రి జైలు గోడలను బద్దులు కొట్టి.. దొంగ దారిలో ఆ ముగ్గురు వీరుల మృతదేహాలను లాహోర్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేనివాలా గ్రామంలో ఖననం చేశారు బ్రిటీష్ అధికారులు.
12 గ్రామాలను అందుకే ఇచ్చింది.. అర్థరాత్రి వేళ బ్రిటన్ అధికారులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల మృతదేహాలను ఎలాంటి సంప్రదాయాలను పాటించకుండా అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం వారి అవశేషాలను పక్కనే ప్రవహిస్తున్న సట్లేజ్ నదిలో పడేశారు. తదనంతర కాలంలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు సమాధులను హుస్సేనివాలాలో స్థాపించారు. అయితే, దేశ విభజన సమయంలో ఈ గ్రామం పాకిస్తాన్ భాగానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం.. సరిహద్దుల్లోని సులేమాన్ ప్రాంతంలో ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్ అప్పగించింది, హుస్సేనివాలా గ్రామాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అలా హుస్సేనివాల భారత భూభాగంలోకి చేరింది.
Also read: