Holi 2021: ఉత్తరప్రదేశ్‌లో వింత ఆచారం.. హోళీ సంబరాల్లో మగవారిని చితకబాదుతున్న మహిళలు.. వైరల్ అవుతున్న వీడియో..
Holi 2021: విభిన్న సంస్కృతుల సమ్మేళనం భారతదేశం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష, ఒక్కో చోట ఒక్కో..
Holi 2021: విభిన్న సంస్కృతుల సమ్మేళనం భారతదేశం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష, ఒక్కో చోట ఒక్కో వేషాధారణ. చెప్పుకుంటూ పోతే పేజీలు పేజీలు రాయాల్సి ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. అయితే వారి ఉద్దేశం మంచికొరకే అయినప్పటికీ.. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. అటువంటి దాని గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. హోళీ పండుగను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో హోళీని అద్భుతంగా జరుపుకుంటాం. ప్రస్తుతం దేశంలో హోళీ కళ వచ్చేసింది. గతేడాది కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు.. ఈసారి హోళీ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని రోజుల్లో హోళీ పండుగ రానుండగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడే హోళీ సంబరాలు ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లో మథుర జిల్లాలో హోళీ సంబరాలు మొదలయ్యాయి. అయితే మథుర జిల్లాలోని బర్సనాలో ప్రజలు హోళీకి ముందు ‘లత్మర్ హోళీ’ అని జరపుకుంటారు. అయితే ఈ సంబరాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందరిలాగే రంగవల్లులను జల్లుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తారు.
ఆ తరువాత మగవారని ఆడ వాళ్లు కర్రలతో కొడతారు. ఆ సమయంలో మగవారు తమకు దెబ్బలు తగులకుండా ఒక పల్లెం లాంటి వస్తువును ఒకదాన్ని అడ్డుగా పెట్టుకుంటారు. ఇక దానిపై ఆడవారు కర్రతో బాదుతారు. అయితే, అది వారి ఆచారమట. అలా చేస్తే చెడు అంతరించి అందరికీ మంచి జరుగుతుందని వారి విశ్వాసం. ఏళ్ల తరబడి ఈ అచారం ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దాన్ని తాము కొనసాగిస్తున్నామంటున్నారు. కాగా, ‘లత్మార్ హోళీ’ సెలబ్రేషన్స్‌కి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నిటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఏడాదికి ఒక్కసారి దొరికే ఈ అద్భుత అవకాశాన్ని మహిళామణులు సరిగ్గా ఊపించుకోండి. మగవాళ్ల గట్టిగా కొట్టండి’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. అసలే కరోనా వ్యాప్తి చెందుతుంటే సామాజిక దూరం పాటించడం మరిచిపోతే ఎలా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పురుషులను కాకుండా, కరోనాను కొట్టండి అంటూ మరో నెటిజనల్ కామెంట్ చేశారు. ఇలా ఆ వీడియోకు కామెంట్ల మోత మోగిపోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చేసేయండి.
ANI Tweet:
#WATCH Women beat men with sticks as part of ‘Lathmar Holi’ celebrations in Barsana, Mathura district, earlier today pic.twitter.com/ouYDkoIZgF
— ANI UP (@ANINewsUP) March 23, 2021
Also read: