Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు.. పాఠశాలలో 3 లక్షల సీలింగ్ ఫ్యాన్‌ల ఏర్పాటు..

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నెలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థుల కోసం

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేట్ స్కూళ్ల తరహాలో సర్కార్ బడులు.. పాఠశాలలో 3 లక్షల సీలింగ్ ఫ్యాన్‌ల ఏర్పాటు..
Cm Ys Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 24, 2021 | 6:03 AM

Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నెలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థుల కోసం పాఠశాలలలో సుమారు 3 లక్షల సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నాడు-నేడు లో భాగంగా తొలిదశలో 15,715 స్కూళ్లలో ఇప్పటి వరకు రూ. 2,580 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఓ వైపు పనులన్నీ శరవేగంగా పూర్తవుతుండగా.. ఇప్పటికే పనులు పూర్తయిన పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. తొలి దశ నాడు-నేడు పనులకు రూ. 3,437 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ నెలాఖరులోగా తొలిదశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పాదయాత్ర సమయంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, విద్యార్థుల వెతలను స్వయంగా చూసిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. నేడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలకు అభివృద్ధికి నడుం బిగించారు. స్కూళ్ల అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. రూ. 826.70 కోట్ల అంచనా వ్యయంతో రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్.. అధికారులను ఆదేశించారు. తొలదిశలో భాగంగా 14,293 మరుగుదోడ్ల పనులు మంజూరు అయ్యాయి. ఇక నాడు-నేడు తొలిదశ పనుల్లో భాగంగా రూ. 325 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు తొలిదశ నాడు-నేడు పనులను పూర్తి చేయాలని ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమం సమీక్ష సమావేశంలో కలెక్టర్లు, జేసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also read:

Govt Schools: ఆన్‌లైన్ చదువులు కుదరదు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదు.. స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి..

OnePlus 9 Series in India: అదిరిపోయే ఫీచర్లతో భారత్‌లో లాంచ్‌ అయిన వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

Zomato Case: జొమాటో కేసులో కీలక పరిణామం.. దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు.. కారణమేంటంటే..