Govt Schools: ఆన్‌లైన్ చదువులు కుదరదు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదు.. స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి..

Schools in Andhra Pradesh: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభం అవడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

Govt Schools: ఆన్‌లైన్ చదువులు కుదరదు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదు.. స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి..
Minister Adimulapu Suresh
Follow us
Shiva Prajapati

| Edited By: Team Veegam

Updated on: Mar 25, 2021 | 8:50 PM

Schools in Andhra Pradesh: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభం అవడంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా నివారణకు చర్యలకు ఉపక్రమించాయి. కరోనా కేసులు అధికంగా ననమోదు అవుతున్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించగా.. ఆ బాటలో మరికొన్ని రాష్ట్రాలు పయనిస్తున్నారు. తాజాగా, తెలుగు రాష్ట్రాల్లోని విద్యాలయాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పదుల సంఖ్య దాటి, వందల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు అన్నీ బంద్ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందులాగే ఆన్‌లైన్ విద్యావిధానం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిన్నమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం స్కూళ్లకు సెలువులు ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ విద్యా బోధన ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ క్లాస్‌ల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతానికి పాఠశాలలకు సెలవులు ఇచ్చేది లేదని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. స్కూళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడొద్దని మంత్రి సురేష్ కోరారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ ప్రోటోకాల్‌ని తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. మాస్క్‌లు విధిగా ధరించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.

ఇదిలాఉండగా.. రాష్ట్రంలో కొత్తగా 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,800 కోట్లు ఖర్చు అవుతాయిన ప్రథమిక అంచనా వేసింది సర్కార్. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో నాడు నేడు పథకం కింద కొత్త కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించారు.

Also read: Holi 2021: ఉత్తరప్రదేశ్‌లో వింత ఆచారం.. హోళీ సంబరాల్లో మగవారిని చితకబాదుతున్న మహిళలు.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: నడిరోడ్డుపై చేపలు పట్టి, స్నానం చేసిన సామాజిక కార్యకర్త.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల