తాజాగా ప్రముఖ టూ-వీలర్ వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ కీలక ప్రటకన చేసింది. ఏప్రిల్ 1, 2021 నుంచి తమ ద్విచక్ర వాహనాలపై రూ.2,500 పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది.ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ కంపెనీ షేర్లు 0.83శాతం పతనం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో స్టీల్, కాపర్, క్రూడ్ ఆయిల్ పెరగడంతో వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని హీరో మోటోకార్ప్ పేర్కొంది.