AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manmohan Singh: రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో.. భారత్ అలా చేయడం సరైనదేనన్న మన్మోహన్ సింగ్

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో ఇండియా ప్రదర్శించి న తీరుపై ప్రధానీ మన్మోహన్ సింగ్ తన స్పందనను తెలియజేశారు. ఈ యూద్ధం విషయంలో భారత్ చూపించిన స్వతంత్ర వైఖరీ సరైనదేనని సమర్థించారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారత్ చాలా మంచి పని చేసిందని ప్రశంసించారు.

Manmohan Singh: రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో.. భారత్ అలా చేయడం సరైనదేనన్న మన్మోహన్ సింగ్
Pm Modi And Manmohan Singh
Aravind B
|

Updated on: Sep 08, 2023 | 12:59 PM

Share

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో ఇండియా ప్రదర్శించి న తీరుపై ప్రధానీ మన్మోహన్ సింగ్ తన స్పందనను తెలియజేశారు. ఈ యూద్ధం విషయంలో భారత్ చూపించిన స్వతంత్ర వైఖరీ సరైనదేనని సమర్థించారు. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారత్ చాలా మంచి పని చేసిందని ప్రశంసించారు. అలాగే ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే ఆవశ్యకతను ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ ఈ విధంగా మాట్లాడారు. అలాగే ఇండియా జీ20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

నా జీవిత కాలంలో ఇండియాకు జీ20 సారథ్య బాధ్యతలు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. జీ 20 దేశాధినేతలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడాన్ని నేను చూస్తున్నానని.. అలాగే భారత పాలన నిర్మాణంలో విదేశాంగ విధానం చాలా కీలకమైనదని చెప్పారు. అయితే ఇది ప్రస్తుతం పార్టీల స్వప్రయోజనాలకు కీలకమైన అంశంగా మారిపోయినట్లు వివరించారు. అయితే తన హయంలో పార్టీ రాజకీయాల కంటే విదేశాంగ విధానానికే అత్యధిక ప్రాధాన్యం ఉండేదని పేర్కొన్నారు. అలాగే ఈ దౌత్యం విషయంలో పార్టీ రాజకీయాలకు వాడుకునే విషయంలో సంయమనం పాటించడం ముఖ్యమని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలపై భారత్ స్పందన గురించి మాట్లాడుతూ.. రెండు లేదా అంతకంటే ఎక్కవ దేశాల మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు ఏదో ఒకదానికి మద్ధతుగా ఉండటం దేశాలకు చాలా కష్టమైన విషయం.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విషయంలో దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఇండియా తీసుకున్న వైఖరీ సరైనదేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సైనిక ఘర్షణను పరిష్కరించే వేదికగా జీ20ని ఎప్పుడూ కూడా పరిగణించలేదని చెప్పారు. అయితే భద్రతాపరంగా ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి వాతావరణ మార్పులు, అసమానతలు, అంతర్జాతీయ వాణిజ్యంలో నమ్మకాన్ని నెలకొల్పే అంశాలపై ఈ జీ20 వేదిక దృష్టి పెట్టడం ముఖ్యమని తెలిపారు. అలాగే భారత సరిహద్దుల పరిరక్షణకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి విషయంలో తాను ఎటివంటి సలహాలు ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పారు. అలాగే 2008లో చంద్రయాన్ పేరిట ప్రారంభమైన అంతరిక్ష ప్రయోగాలు సరికొత్త శిఖరాలకు చేరుకోవడం గర్వంగా ఉన్నట్లు తెలిపారు.