ఉద్యోగాల కోసమని 27మంది మయన్మార్ వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
ఉద్యోగ అవకాశాల పేరుతో మయున్మార్ వెళ్లి మోసపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 27 మంది యువకులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఈ యువకులు సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చారు. మయున్మార్‌లో నెలల తరబడి నరకయాతన అనుభవించిన బాధితుల కథ అందరినీ కలచివేసింది.

ఉద్యోగ అవకాశాల పేరుతో మయన్మార్ వెళ్లి మోసపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 27 మంది యువకులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఈ యువకులు సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చారు. మయున్మార్‌లో నెలల తరబడి నరకయాతన అనుభవించిన బాధితుల కథ అందరినీ కలచివేసింది.
యువకులు మయన్మార్‌లో ఎలా చిక్కుకున్నారు?
మంచి ఉద్యోగం, అధిక జీతం అంటూ మధ్యవర్తుల మాటలు నమ్మి మయున్మార్ వెళ్లిన 27 మంది యువకులు అక్కడికి చేరుకున్నాక వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని గుర్తించారు. యువకులను బలవంతంగా సైబర్ మోసాల కార్యకలాపాల్లోకి నెట్టడం, శారీరక వేధింపులకు గురిచేయడం, స్వేచ్ఛ లేకుండా నిర్బంధంలో ఉంచడం వంటి అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన బాధితులు వీడియోల ద్వారా తమ గోడును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల పరిస్థితి తెలుసుకున్న వెంటనే కేంద్ర మంత్రి స్పందించి వారిని వెంటనే రక్షించాల్సిన అవసరం ఉందని భావించారు. ఈ విషయమై విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జై శంకర్‌కు లేఖ రాసి, మయున్మార్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావాలని కోరారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, యాంగాన్‌లోని భారత రాయబారి కార్యాలయం సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టి బాధితులను న్యూఢిల్లీకి సురక్షితంగా తీసుకువచ్చారు.
అండగా నిలుస్తాం: రామ్మోహన్ నాయుడు
స్వదేశ గడ్డపై అడుగుపెట్టిన వెంటనే బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విదేశాంగ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు బాధితులను వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడి భద్రత, గౌరవం కాపాడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, దేశం వెలుపల ఎక్కడైనా భారతీయులు ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో అయినా మానవ అక్రమ రవాణా ప్రమాదాల పై యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, యువత మోసపు మాటలు నమ్మి జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
