రాజస్తాన్‌లో దారుణం.. కుమార్తె మృతదేహాన్ని సీటు బెల్ట్‌తో కట్టి తీసుకెళ్లాడు..! ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?
rajasthan incident : తండ్రి తన కుమార్తె మృతదేహాన్ని కారులో సీట్ బెల్ట్‌తో కట్టేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని వెనుక
rajasthan incident : తండ్రి తన కుమార్తె మృతదేహాన్ని కారులో సీట్ బెల్ట్‌తో కట్టేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని వెనుక ఏం జరిగిందో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. రాజస్తాన్‌లో జరిగిన ఈ ఘటన మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉంది.. అంబులెన్స్ డ్రైవర్ల అత్యాశే ఈ ఘటనకు కారణమని తేలింది. వివరాల్లోకి వెళితే.. మృతురాలు సీమాను కొవిడ్ వల్ల ఏప్రిల్ 24 న కోట కొత్త ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె కోటాకు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న హలవార్ గ్రామానికి చెందినది.
అయితే మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లడానికి ఆమె తండ్రి అంబులెన్స్ డ్రైవర్లను సంప్రదించినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆ గ్రామానికి రావడానికి 15000-35000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారని తెలిసింది. నిజానికి అంబులెన్స్ ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది కానీ డ్రైవర్లు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో అన్ని డబ్బులు చెల్లించే స్తోమత లేక తండ్రి తన కారు ముందు సీటుపై మృతదేహాన్ని ఉంచి సీటు బెల్టుతో కట్టి హలావర్‌కి తీసుకెళ్లాడు. కలెక్టర్ ఉజ్జవాల్ రాథోడ్ ఈ విషయంపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. మేము ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని అధిక డబ్బులు డిమాండ్ చేసిన డ్రైవర్ల వివరాలను తెలపాలని ఆ తండ్రిని కోరాడు.