Jaggareddy on Etela : బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
Congress MLA Jaggareddy shocking comments : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు..

Jaggareddy
Congress MLA Jaggareddy shocking comments : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ పార్టీ పెడితే, నష్టపోతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో మరో రాజకీయపార్టీకి స్థానం లేదన్న జగ్గన్న.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే తెలంగాణలో ఉంటాయన్నారు. బీసీ నాయకుడిగా ఈటలకు అంత సీన్ లేదన్నారు జగ్గారెడ్డి. బీసీ నేత ఆర్ కృష్ణయ్య విషయంలోనే సాధ్యం కానిది ఈటెల వల్ల ఎలా అవుతుందని ఆయన టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఇంకా జగ్గారెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఈ దిగువ వీడియోలో చూద్దాం..