Cyclone Yaas : అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్.. రేపు మధ్యాహ్నానికి దమ్రా పోర్ట్ సమీపంలో తీరం దాటే అవకాశం

Yaas intensifies into ‘very severe cyclonic storm’ : ఐదు రాష్ట్రాలను హడలెత్తిస్తోన్న సైక్లోన్ యాస్ ప్రస్తుతం అతి తీవ్రమైన తుఫానుగా మారింది..

Cyclone Yaas : అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్.. రేపు మధ్యాహ్నానికి దమ్రా పోర్ట్ సమీపంలో తీరం దాటే అవకాశం
Cyclone Yaas
Follow us

|

Updated on: May 25, 2021 | 10:56 PM

Yaas intensifies into ‘very severe cyclonic storm’ : ఐదు రాష్ట్రాలను హడలెత్తిస్తోన్న సైక్లోన్ యాస్ ప్రస్తుతం అతి తీవ్రమైన తుఫానుగా మారింది. బుధవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని భద్రాక్ జిల్లాలోని దమ్రా పోర్ట్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. మొత్తంగా తుఫాను ప్రభావిత ఐదు రాష్ట్రాల్లో 115 టీమ్స్ సిద్ధం చేశారు. ఒడిశాలో 52, పశ్చిమ బెంగాల్‌లో 45, అండమాన్ నికోబార్ లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి. సైక్లోన్ యాస్ తీరం దాటే సమయంలో గంటకు 160-185 కిమీ మేర బలమైన గాలులు వీయనున్నాయి. ఇలా ఉండగా, ‘యాస్’ తీవ్ర తుఫాను గడచిన 06 గంటలలో 17 kmph వేగంతో వాయువ్య దిశలో ప్రయాణించి ఈ రోజు (25.05.2021) ఉదయం 08:30 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఇంకా ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలలో latitude 18.3°N మరియు longitude 88.3°E వద్ద, పారాదీప్(ఒడిశా) కి దక్షిణ ఆగ్నేయంగా 280 km, బాలాసోర్ (ఒడిశా) కి దక్షిణ ఆగ్నేయంగా 380 km, ఇంకా, దిఘా (పశ్చిమ బెంగాల్) కి దక్షిణ ఆగ్నేయంగా 370 km దూరాలలో కేంద్రీకృతమై ఉంది.

ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ తర్వాతి 12 గంటలలో అతి తీవ్ర తుఫానుగా బలపడింది. ఇది 26.05.2021 వ తేదీ మధ్యాహ్నంనకు ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలలోని పారాడిప్ – సాగర్ ద్వీపాల మధ్య దమ్రాపోర్ట్ కు ఉత్తరం, బాలాసోర్ కు దక్షిణంనకు దగ్గరలో అతి తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రము సంచాలకులు తెలియజేశారు.

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..
తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..