Gujarat: ఎన్నికల వేళ.. ఈసీ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా 900 మంది అధికారులను..

త్వరలో జరగనున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ప్స్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నాయి. మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని..

Gujarat: ఎన్నికల వేళ.. ఈసీ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా 900 మంది అధికారులను..
Election Commission
Follow us

|

Updated on: Oct 27, 2022 | 1:14 PM

త్వరలో జరగనున్న గుజరాత్ శాసన సభ ఎన్నికలు ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నాయి. మళ్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆప్, ఇతర పార్టీలు ప్రాణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని సుమారు 900 మంది అధికారులను బదిలీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు వివిధ గ్రేడ్లు, సర్వీసులలో పని చేస్తున్న అధికారులను బదిలీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చారు. ఈ నెల 21న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి లేఖలు రాసింది. అధికారుల బదిలీ గడువు ముగిసిన తర్వాత వారి బదిలీలకు సంబంధించిన ఆదేశాలను పాటించినట్లుగా నివేదికలను సమర్పించాలని కోరింది. గురువారం నాటికి ఈ నివేదికలను సమర్పించాలని ఆదేశించింది.

కాగా.. ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ సమయంలోనే గుజరాత్‌ ఎలక్షన్ డేట్‌ని కూడా ప్రకటిస్తారని భావించినా ఈసీ వెల్లడించలేదు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెలాఖరులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుంది. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో చివరిసారి 2017లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి రాగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.

కాగా.. గత వారం కేంద్ర మంత్రి అమిత్‌ షా గుజరాత్‌లో రెండ్రోజుల పాటు పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ప్రధాని మోడీ కూడా రెండు రోజుల పాటు గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేశారు. ఆప్‌ నేతలు కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ గుజరాత్ ఇంచార్జ్ రఘు శర్మ.. ప్రచారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఆప్ మాత్రం ఈ విషయంలో ముందే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి