Guwahati-Bikaner Express: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా..
Guwahati-Bikaner Express: పశ్చిమ బెంగాల్‌లోజరిగిన రైలు ప్రమాదంలో మృతలు సంఖ్య 8కి చేరింది. పలువరికి గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో..

Guwahati-Bikaner Express: పశ్చిమ బెంగాల్‌లోజరిగిన రైలు ప్రమాదంలో మృతలు సంఖ్య 8కి చేరింది. పలువరికి గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబర్ 15633) పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రైలు బోగీలు ఒకదానిపైకి మరొకటి దూసుకు వచ్చాయి. మరికొన్ని బోగీలు ట్రాక్ బయటకు వచ్చి పల్టీలు కొట్టాయి. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్(15633) గురువారం సాయంత్రం జల్‌పైగురి జిల్లాలోని దోమోహని ప్రాంతంలో పట్టాలు తప్పింది. రైలుకు సంబంధించిన 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు మృతులను గుర్తించగా తాజాగా ఆ సంఖ్య 8కి చేరింది. మరి పూర్తి స్థాయిలో బోగీలను వెలికితీస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Spoke to Railways Minister Shri @AshwiniVaishnaw and took stock of the situation in the wake of the train accident in West Bengal. My thoughts are with the bereaved families. May the injured recover quickly.
— Narendra Modi (@narendramodi) January 13, 2022
Deeply saddened by the loss of lives due to the derailment of Bikaner-Guwahati Express in Jalpaiguri, West Bengal. My heartfelt condolences to the bereaved families. I pray for the speedy recovery of the injured.
— Vice President of India (@VPSecretariat) January 13, 2022
Anguished to learn about the loss of lives due to a tragic rail accident in West Bengal. My deepest condolences with the bereaved families. Praying for the speedy recovery of those injured.
— Amit Shah (@AmitShah) January 13, 2022
ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సంఘటన విషయమై ప్రధాని రైల్వే మంత్రితో మాట్లాడారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇక రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం అమిత్‌షా సంతాపం వ్యక్తం చేశారు.
Enhanced amount of ex-gratia compensation to the victims of this unfortunate accident: Rs. 5 Lakh in case of death, Rs. 1 Lakh towards grievous and Rs. 25,000 for minor injuries.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 13, 2022
ఇదిలా ఉంటే ప్రమాదంలో మరణించిన వారికి రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షలు, తీవ్ర గాయాలు అయిన వారికి రూ. 1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 25,000 ప్రకటించారు. అలాగే గురువారం రాత్రి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి స్వయంగా సందర్శించారు. సహాయక చర్యలను దగ్గర ఉండి సమీక్షించారు.