Tirupati Airport: నిజమే అని తేలితే సీరియస్ యాక్షన్.. తాగునీరు నిలిపివేసిన ఘటనపై కేంద్ర మంత్రి ట్వీట్..

తిరుపతి ఎయిర్ పోర్టుతో పాటు స్టాఫ్ క్వార్టర్స్‌కు తాగునీరు నిలిపివేయడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయానమంత్రికి..

Tirupati Airport: నిజమే అని తేలితే సీరియస్ యాక్షన్.. తాగునీరు నిలిపివేసిన ఘటనపై కేంద్ర మంత్రి ట్వీట్..
Jyotiraditya
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 13, 2022 | 9:41 PM

తిరుపతి ఎయిర్ పోర్టుతో పాటు స్టాఫ్ క్వార్టర్స్‌కు తాగునీరు నిలిపివేయడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయానమంత్రికి దీనిపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే బీ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరాను నిలిపివేశారని ఆరోపించిన తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమస్యను పరిశీలిస్తామని, విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగబోదని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

తిరుపతి విమానాశ్రయానికి తాగునీరు నిలిపేయించిన ఘటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నహసింహారావు కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయానమంత్రి జోక్యం చేసుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరుపతి ఎయిర్ పోర్టు ఘటనపై బీజేపీ నేతలు కేంద్రంలోని ఇతర పెద్దలకు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేత చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వకపోతే తాగునీరు నిలిపేసి టార్గెట్ చేస్తారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై ఇంకా సదరు వైసీపీ నేత అభినయ్ రెడ్డి కానీ, ఆయన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..

AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ